-
-
కన్యాశుల్కం - 19వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకం - తులనాత్మక పరిశోధన
kanyaaSulkaM 19va Sataabdi aadhunika bhaarateeya naaTakaM tulanaatmaka pariSOdhana
Author: Dr. U. A. Narasimha Murthy
Publisher: N. K. Babu Publications
Pages: 666Language: Telugu
ఆధునిక భారతీయ నాటకాలలో ప్రదర్శన యోగ్యమైన నాటకాల సంఖ్య ఎక్కువ. అవి పక్కువ పఠన యోగ్యమైనవి కావు. పఠన యోగ్యమైన నాటకాల సంఖ్య తక్కువ. అందులో సార్వకాలిక పఠన యోగ్యత మరీ తక్కువ. కన్యాశుల్కం రెండు రకాల నాటకాల కంటే పరిపూర్ణంగా భిన్నమైనది. గురజాడ కన్యాశుల్కం మొదట 1892లో పరిపూర్ణంగా ప్రదర్శన యోగ్యమైన నాటకంగా సృష్టించాడు. సంవత్సరాల తరబడి కృషి చేసి ఆ నాటకాన్నే 1909 నాటికి పఠన యోగ్యమైన సారస్వత నాటకంగా తీర్చిదిద్దారు. కన్యాశుల్కం నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించనికి వీలుపదని కొందరు విమర్శకులు భావించిన మాటలలో వాస్తవం ఉన్నా అందులో ప్రదర్శన యోగ్యం కాని సన్నివేశం ఒక్కటీ లేదు. పఠన పాఠనాలలో నిలువని సన్నివేశం కూడ ఒక్కటీ లేదు. అందులోని ఏ సన్నివేశానికా సన్నివేశం విడివిడిగా ప్రదర్శించినా రక్తి కడుతుంది. నాటకాన్ని పరిమిత కాలంలో ప్రయోగించనికి తగిన రీతిగా సంక్షేపించి ప్రదర్శించినా నాటకం సాధించదలచుకొన్న ప్రధాన లక్ష్యం కొంచెం కూడ భంగ పడదు. అందులో ప్రతి సంభాషణా దైనందిన వ్యవహారంలో తెలుగు వారి జీవితంలో ఎక్కడో ఒక చోట ఇమిడిపోతుంది. ఈ విషయాన్ని చర్విత చర్వణంగా ప్రస్తావన చేయడంలో గల ఉద్దేశ్యమొకటే. ప్రదర్శన యోగ్యత, పఠన యోగ్యత అనే రెండు లక్ష్యాలను గురజాడ ఒకే నాటకంలో సాధించగలిగాడు. తెలుగులోనే కాదు, ఆధునిక భారతీయ భాషలలో ఏ ఇతర నాటకమూ ఈ విషయంలో కన్యాశుల్కానికి సాటిరాదు.
