-
-
కైవారం
kaivaaram
Author: Vishwanadhula Pushpagiri
Publisher: Self Published on Kinige
Pages: 64Language: Telugu
రావురి భరద్వాజ, నగ్నముని, వేణు సంకోజులను మైమరపించిన కవితా సంపుటి..
నగ్నముని తనని అత్యంతగా ఆకట్టుకున్న పుస్తకమని వేదికపైన తెలిపిన కవిత్వమిది..
* * *
సమస్త దుఖాల్ని వెతుకుతున్న దేశదిమ్మరి, కన్నీటిపై అక్షరాల్ని అలుకుతున్న ఆవారా, సిద్ధాంతాల గద్దెల్ని గద్దలా తన్నుకుపోయే ఆలోచనల్లో నేను కమ్మరోన్నంటడు. కొలిమిల్నే ఆకలి, ఆయుధం నిక్షిప్తమయి ఉందని నివురు గప్పిన నెగడులా నింగిని మింగిన నీటిలా రగులుతుంటాడు. అతని వయస్సు హమ్మింగ్ బర్డ్, చీకటిని, నలుపును ప్రేమిస్తాడు, మోహిస్తాడు. ఆమెను అర్థనారి కాదు అవనికి, ఆకాశానికి, ఆత్మకీ, ఈ యుగం నరమాంస భక్షకుల భోగం అని అంటాడు. కవివి కాదు కాలాంతకునివంటే కళలన్నీ కలిసి కాష్టాల గడ్డపై నను కప్పెట్టనీ అంటాడు. తన గుండెను ముక్కలుగా నరికి మనసును మౌనంగా విశ్వాంతరాల్లో పరివ్యాప్తం చేస్తాడు.
- "రుంజ"
("రుంజ" విశ్వకర్మ రచయితల, కళాకారుల వేదిక, హైద్రాబాద్)
