-
-
జీవన రాగాలు
jeevana raagaalu
Author: Thota Sulochana
Publisher: Penna Rachayitala Sangham
Pages: 39Language: Telugu
కాదేది కవిత్వానికి అనర్హమన్నట్లుగా శ్రీమతి తోట సులోచన గారు అనేక అంశాలను తీసుకొని చక్కని కవితలను అల్లారు. సమాజపు మార్పును కోరుతూ 'మార్పు' అనే కవితను వ్రాశారు. 'సమసమాజానికి చైతన్యం విద్యార్థి' అంటూ 'విద్యార్థి ఎవరునీవు?' అను కవితను వ్రాశారు. వలపుల రాణి, తలపుల బోణి అంటూ చిరుగాలిని సంభోదిస్తూ ''చిరుగాలి నెచ్చెలి' అనే కవితను వ్రాశారు. నాడు ఎంతో వైభవంగా ఉండే ఉదయగిరిని చూసి ఆవేదనతో ''ఉదయగిరి వైభవం'' అనే కవితను వ్రాశారు. తన హృదయాంతరాళాలలో కోటి రాగాలను పలికించేది స్నేహమంటూ కవితలో వ్రాశారు. తెలుగుభాష విశిష్టతను గూర్చి ''మన మాతృభాష తెలుగు'' అనే కవితలో వివరించారు. సమస్త భూగోళాన్ని మన కళ్లముందు నిలిపే దినపత్రిక గూర్చి 'ఓహో దినపత్రిక' అనే కవితలో చక్కగా వివరించారు. అక్షర సరాగాలు ఈ జీవనరాగాలు.
- మోపూరు పెంచల నరసింహం
* * *
కవిత్వం మనుషుల మనస్తత్వాన్ని యనలైజ్ చేసి మనకళ్ల ముందుంచే ఒక మీడియా. అంతేకాదు పాఠకులు తమ అంతరంగంలోకి తొంగి చూసుకునే అవకాశాన్నిచ్చే ప్రక్రియ. సులోచన సమాజంలోనుండి పాఠకుల్ని ప్రభావితం చేయగల వస్తువుల్ని ఏరుకొని మంచి నిర్మాణంలో ఆర్ద్రతను తోడుచేసి ముప్ప్షె కవితలు వ్రాసి కవితా సంకలనంగా తీసుకొచ్చారు. ఆకలి చావుల గురించి, చీకటి బ్రతుకుల గురించి, మానవత్వం గురించి, స్నేహం గురించి అందరు మెల్లమెల్లగా నిర్లక్ష్యం చేసున్న బాపూజీ గురించి, ఇంకెన్నో కనువిప్పు కలిగించే అంశాల గురించి చక్కగా కవిత్వీకరించారు.
- జయప్రద
