-
-
జీవన చిత్రాలు
jeevana chitraalu
Author: koora chidambaram
Publisher: Self Published on Kinige
Pages: 55Language: Telugu
'జీవన చిత్రాలు'. శీర్షికలోనే జీవన (జీవిత) మెంత విచిత్రమో, తెలియజేప్పే ప్రయత్నం కన్పిస్తుంది. చిదంబరంగారు తమ సుదీర్ఘ జీవిత ప్రయాణంలోని మలుపులను ఆసరాగా తీసుకొని రాసిన జీవన చిత్రాలకు కొలతలు, ఆంక్షలు పెట్టుకోలేదు. మనస్సులోని భావాన్ని బట్టబయలు చేయడమే కన్పిస్తుంది. భావాన్ని కవిత్వపు షరతుల చట్రాలలో బంధించ దలచుకోలేదేమో... చెప్పాలనుకున్న భావన పూర్తవగానే ఆపేస్తారు. రెండు పంక్తులా!! నాలుగు పంక్తులా!! వచనకవిత్వమా? మినీ కవిత్వమా? హైకూలా? నానీలా? లాంటి ఆలోచనలేవీ లేకుండా...
వీరి జీవన చిత్రాలలోకి వెళ్తే నేటి సమాజంలోని అన్ని కోణాలను జీవితంలోని అన్ని పార్శ్వాలను స్పృశించడం కన్పిస్తుంది. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, సూటిగా, చెప్పడమే వీరి ప్రత్యేకత...
మనుష్యుల మధ్య ఉన్న బంధాలు, అనుబంధాలు, ప్రకృతితో సహజీవనం, జీవితంలో భాగమైన చెట్లు, చేమ... తన గురించి తాను, తన ఆలోచనలు... అన్నింటిని అందరితో పంచుకోవాలన్న తపన చిదంబరంగారి చిన్న పదాల్లో కన్పిస్తుంది. మనస్సుకు ఆలోచనలను, ఆవేదనను, ఆనందాన్ని కలిగించే చిన్న ''సంక్షిప్తాలు'' ఇవి.
- డా. విష్ణు వందనా దేవి
* * *
మనను, మన సమాజాన్ని దోపిడి చేస్తున్న విధాయకాన్ని నిరసిస్తూ గీచిన భావచిత్రాలు "జీవన చిత్రాలు".
మన సమాజం పురోగతిన సాగుతుందో, తిరోగతిన సాగుతుందో, సాధిస్తున్నది అభివృద్ధో, విధ్వంసమో తెలియ పరిచే ప్రయత్నం "జీవన చిత్రాలు".
వాణిజ్య విద్యలో చార్టెర్డ్ ఎక్కౌంటెన్సీ చేసి 60 ఏళ్ళుగా జీవితాన్ని, పరిసరాల్నీ, పరిణామాల్నీ పరిశీలించి విశ్లేషించి చిత్రీకరించిన చిత్రాలు "జీవన చిత్రాలు".
