-
-
గాథాత్రిశతి
gaathaatriSati
Author: Narala Rama Reddy
Publisher: Saroja Publications
Pages: 182Language: Telugu
గాథాత్రిశతి
శాలివాహన పాకృత గాథలకు నరాల రామారెడ్డి ఆంధ్రానువాదం
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి
నరాల రామారెడ్డిగారి అనువాదంలో నిర్దిష్టత, నిష్కర్షత సమ ప్రమాణంలో ఉన్నాయి. మూలంలోని వ్యంగ్యం, రసభావాలు, అలంకారాలు, ఈ అనువాదంలోనూ తొణికిసలాడుతున్నాయి.
శృంగార, కరుణ, హాస్యాలను సమ్మేళనం చేసుకున్న గాథలివి. రామారెడ్డి గారు అనువాదరూపంలో తెలుగువారికి మరో కవితామౌక్తికహారం అందించారు.
* * *
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
ఇప్పుడు గాథాత్రిశతి మిత్రులు నరాల రామారెడ్డిగారు అందిస్తున్న తాజారోజా పువ్వు. చిన్ని శ్లోకానికి చిన్ని పద్యం ఎంచుకొని గాథల సౌందర్య రహస్యం క్లుప్తతని మన్నించడంతోనే వీరు మొదటి గెలుపు అందుకున్నారు. ఇందులో పద్యాలు అన్నీ సౌకుమార్యసుందరాలు. ఇది వీరి రెండవ గెలుపు.
* * *
- వాడ్రేవు చినవీరభద్రుడు
ప్రముఖ కవి, పండితులు నరాల రామారెడ్దిగారు అనువాదం చేసిన ఈ సంకలనం తెలుగు సాహిత్యానికొక అపురూపమైన కానుక. ఈ అమృతగాథలకి ఈ లలితగేయాలకి ఎటువంటి భాష వాడాలో, ఎటువంటి మృదులశయ్య సమకూర్చాలో ఈ రసజ్ఞుడికి తెలుసు.
* * *
- పి. రామకృష్ణ
రామారెడ్డి పండితుడు, తెలుగు పద్యరచనా? అలవోకగా చెప్పగల సమర్థుడు, అవధానాల్లోనూ పద్యంతో పాటు కవిత్వం చెప్పాలన్న సావధానంతో వుండిన ఆబాల్యకవి. ఇవ్ప్పుడు వేగాతివేగోక్తి నుంచీ రమ్యాక్షరక్షోణికి వచ్చిన రామారెడ్డి.
