• evarito elaa maatlaadaali raamaayanamlo hanumantudu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఎవరితో ఎలా మాట్లాడాలి

  evarito elaa maatlaadaali raamaayanamlo hanumantudu

  Publisher: Ushasri Mission

  Language: Telugu
  Rating
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  '4.43/5' From 14 votes.
  4.20 Star Rating: Recommended
  4.20 Star Rating: Recommended
  4.20 Star Rating: Recommended
  4.20 Star Rating: Recommended
  4.20 Star Rating: Recommended
  '4.20/5' From 10 premium votes.
Description
ముందుమాట
మాట చేతకాక విరోధాలు తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయే వారెందరో ఉన్నారు.
మాటతో లోకాన్ని జయించి, సమాజంలో సన్మానాలు పొందే వారూ ఉన్నారు.
మాట్లాడటం అనే విద్య నేర్చుకోవాలనుకున్న వారికి హనుమంతుడే గురువు. ఆ మహనీయుడు కార్యాచరణ దీక్షలో కూడా నేటి యువతీ యువకులకి ఆదర్శప్రాయుడు.
అని ఎంతో గాఢంగా నమ్మేవారు ఉషశ్రీ.
ఆ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్న కోరికతోనే 'రామాయణంలో హనుమంతుడు' అనే పుస్తక రచనని ప్రారంభించారు.
అయితే అది అసంపూర్ణంగా మిగిలిపోయింది.
ఉషశ్రీ తన ఉపన్యాసాలలో తెలిపిన భావాలను అధ్యయనం చేసిన ఆయన పెద్దమ్మాయి డాక్టర్ గాయత్రీదేవి ఈ అసంపూర్ణ రచనని ఆయన మాటలతోనే పూర్తి చేశారు.
రెండు ముద్రణలు పొందిన ఆపుస్తకం ఆధారంగా "ఎవరితో ఎలా మాట్లాడాలి?" రూపుదిద్దుకుంది. ఉషశ్రీ పెద్దమ్మాయి చేతిలోనే.
ఉషశ్రీ జీవితాశయాలని ప్రజలకి చేరువ చెయ్యాలన్న ఉద్దేశ్యంతో కార్యక్రమాలు మొదలు పెట్టిన 'ఉషశ్రీ మిషన్' మీ అభిప్రాయాలనూ, సలహా సహకారాలనూ కోరుకుంటోంది.
--ఉషశ్రీ మిషన్
ఉషశ్రీ
ఆ రోజుల్లో పండితుల కర్మాగారంగా ప్రసిద్ధి పొందిన పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రులో జన్మించిన శ్రీ ఉషశ్రీకి తల్లి (కాశీ అన్నపూర్ణ) తండ్రులే (పురాణపండ రామమూర్తి) ప్రథమ గురువులు.
కవీ, కథకుడూ, నాటకకర్తా అయిన ఉషశ్రీ ఆకాశవాణిలో (1965) ప్రవేశించి, సూటిగా లక్ష్యంవైపు దూసుకుపోయే బాణం లాంటి తన వాక్కుతో (1973 నుండి దశాబ్దం పైగా) ఎందరికో ధర్మసందేహాలు తీర్చారు. రామాయణ, మహాభారత కావ్యాలని మధించి, మధుర గంభీర గళంతో అశేష జనావళికి జ్ఞానసుధను పంచారు. ఉపన్యాసాన్ని ఒక కళగా రూపొందించి రామాయణ భారతోపన్యాసాలతే యావదాంధ్రదేశాన్నీ ఉర్రూతలూగించారు. నేటికీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సి.డిల రూపంలో ఆ జ్ఞానసుధని ఆస్వాదిస్తూనే ఉన్నారు.
మానవజాతి సర్వకాలాలలోనూ సుఖశాంతులతో మనుగడ సాగించడానికి అవసరమయిన విశేషాలు అందించే గ్రంథాలు అని ప్రతిపాదిస్తూ ఆయన వ్రాసిన రామాయణ భారత భాగవతాల ప్రతులు లెక్కలేనన్ని లక్షల సంఖ్యలో పాఠకులకి చేరాయి. చేరుతూనే ఉన్నాయి. తన జీవితాన్ని (1928 - 1990) కావ్యత్రయ ప్రాచుర్యానికి అంకితం చేసిన ఉషశ్రీ కలం, గళం అమరం.
గాయత్రీదేవి రెండున్నర దశాబ్దాలుగా ఎందరికో వైద్యసేవలు, మాస దిన పత్రికలూ, టి.వి. ఛానెల్స్, పుస్తకాల ద్వారా అందరికీ ఆరోగ్య సూచనలూ- వైద్య విద్యార్థులకి పాఠ్యగ్రంథాలూ- అందిస్తున్న డాక్టర్ గాయత్రీదేవి ఉషశ్రీ పెద్దమ్మాయి.
వారసత్వంగా సంక్రమించిన 'రచనాసక్తితో' అప్పుడప్పుడూ కథలూ, రేడియో నాటికలూ, రూపకాలూ రాసే గాయత్రీదేవి, తండ్రి అసంపూర్ణ రచన 'రామాయణంలో హనుమంతుడి'ని పూర్తి చేశారు.
తన రచనలకి కొన్ని అవార్డులతో పాటు భరతముని ఆర్ట్స్ అకాడమీ వారి 'ఆదర్శవనిత' పురస్కారం అందుకున్నారు.
Preview download free pdf of this Telugu book is available at evarito elaa maatlaadaali raamaayanamlo hanumantudu
Comment(s) ...

i have recharged the amount 30 rupees but i am not able to open the book for reading this ramayanamlo hanumantudu. i am looking for help. how to open the book even i have down loaded the ADE. Please call me my mobile number 9618767603. The below are the details about my book.
Your Payment reference ID is.52317
Your Account is Recharged with Rs.30.00 . Thanks in advance. Suresh

Team, I am unable to download the book after paying the amount, I have wrote several emails and got response that you are working, but its been nearly two months the issue is not resolved, not only this books there are other books which we are purchasing is not avaufor download,, this is becoming kind of cheating the customers, please let me know how soon you fix, if not we can proceed agai