-
-
ఎంత సుదీర్ఘమీ జీవితం!
enta sudeerghamee jeevitham
Author: Ganti Bhanumathi
Publisher: Ganti Prachuranalu
Pages: 103Language: Telugu
శ్రీమతి గంటి భానుమతి కలంనించి వెలువడ్డ కథల సంపుటిలోని కథల్లో చాలా భాగం మానసిక విశ్లేషణతో కూడినవే. మంచికథ గురించి చెప్తూ, "ఏ షార్ట్ స్టోరీ షుడ్ బి లాంగినఫ్ టు కన్సీల్ వాటీజ్ ఇన్సైడ్ అండ్ షార్ట్ ఇనఫ్ టు షో ఇట్" అన్నాడో ఆంగ్లేయుడు. ఈ కథలన్నీ ఆ కొటేషన్‌కి అనుగుణంగా నడిచిన మంచి కథలు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
* * *
ఈ సంపుటిలో రచయిత్రి శైలిలో భావుకత ఎక్కువగా కనిపిస్తుంది. చైతన్యస్రవంతిని కూడా కొంత ప్రవేశపెట్టడంవల్ల మనోభావాల అభివ్యక్తంలో విలక్షణత చోటుచేసుకుంది. మొత్తంమీద ఇవన్నీ మానవత్వాన్నీ, జీవితం పట్ల ఆశాభావాన్నీ స్ఫురింపజేసే కథలు.
- అబ్బూరి ఛాయాదేవి
* * *
మంచి సృజనాత్మతకత, ప్రతిభ పుష్కలంగా వున్నాయి వీరి కథలలో.చక్కటి శైలీ, సంభాషణా చాతుర్యంగల ఈ కథలు అందరూ చదవాలని మళ్లా ఒకసారి కోరుకుంటున్నాను.
- శారదా అశోక్ వర్థన్
* * *
వైవిధ్యమైన కథలు, భిన్న ప్రవృత్తులు గల పాత్రలు, మనసు అరల్లోకి చొచ్చుకుపోగలిగే మంచి శైలితో తన ఆలోచనల గళానికి కలం బలాన్నీ నింపి, ప్రతి కథనీ పాఠకుడికి ఓ టానిక్‌లా మలిచారు.
- కొమ్మనాపల్లి గణపతిరావు
* * *
కథలన్నీ వస్తువైవిధ్యంతో రమ్యంగా రమణీయంగా ఉన్నాయి. వస్తువు వివిధ రూపాలు కావటంచేత, భాషా, వ్యక్తులూ, పరిస్థితులూ, వాతావరణం మారి, వర్ణనలూ కథలూ మూసలోపోసినట్లు కాకుండా వైవిధ్య భరితంగా చాలా ఒప్పాయి, నప్పాయి. కథలలో భావం అహమహమికలుగా పోటీ పడ్డాయి.
- అరుణావ్యాస్
