-
-
ధీరయువతకు...
dheera yuvataku
Author: Swami Vivekananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 328Language: Telugu
మా ద్విభాషా పుస్తకాల క్రమంలో మూడవ పుస్తకం ఇది. మొదటి పుస్తకం 'జాగృతి'కి పాఠకుల నుంచి ముఖ్యంగా యువత నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. జాగృతి పుస్తకంలో కేవలం రెండు, మూడు పంక్తుల స్ఫూర్తి వాక్యాలను ఎన్నుకోవటం జరిగినది. పాఠకులకు స్వామి వివేకానంద బోధనలను సంక్షిప్తంగా పరిచయం చేయటానికి ఆ పుస్తకం ఉద్దేశించ బడినది. స్వామి వివేకానంద బోధనలను పాఠకులకు ఇంకాస్త వివరంగా పరిచయం చేయటానికి ఈ 'ధీరయువతకు...' పుస్తకాన్ని సంకల్పించాము. స్వామీజీ ధీర వాక్కులను మూల భాషలోనూ (ఆంగ్లంలో), మరియు తెలుగు అనువాదంతో సహా ఇవ్వడం వల్ల వాక్యం చక్కగా అర్థమవుతుందన్న మా భావన 'జాగృతి' పుస్తకం పొందిన ప్రజాదరణతో నిజమని నిరూపింపబడింది. ఇలాంటి పుస్తకాలను ఇంకా తీసుకురావటానికి మాకు ప్రోత్సాహం లభించింది.
ఆ ప్రయత్నంలో భాగమే ఈ ప్రస్తుత పుస్తకం. ఈ పుస్తకంలో ఒకే విషయానికి సంబంధించిన స్ఫూర్తి వాక్కులన్నింటినీ ఒక శీర్షిక క్రింద కూర్చటం జరిగినది. వరుసలోని ప్రతి సూక్తి క్రితం పేజీలోని సూక్తిని బలోపేతం చేస్తుండంటం వలన పాఠకుడు ప్రతి సూక్తినీ చక్కగా అర్థం చేసుకోవటానికి వీలుంది. కొన్ని భావాలు, సూక్తులు అక్కడక్కడ పునరావృతమై ఉండవచ్చు. అవి ఒకేరకంగా పునరావృతం కాకుండా ఒక పెద్ద సూక్తిలో భాగంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఉద్దేశపూర్వంగా అలాగే ఉంచటం జరిగినది. స్వామి వివేకానంద సూక్తుల నుంచి అధిక ప్రేరణ పొందటానికి పాఠకులకు ఈ పుస్తకం ఉపయుక్తం అవుతుందని భావిస్తాము.
- ప్రకాశకులు
- ₹540
- ₹108
- ₹81
- ₹60
- ₹269.1
- ₹72
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108
dear sir,
i am purchasing books from kinege for a while and i am very impressed and excited. but for the past 60 days , there are no printed books showing. please make sure they are available for online purchase in kinege. thank you
Sir I am getting trouble with the link 'download purchased e book' its working but not downloads actval content what I need.....please help me. I purchased this book at the cost of 9Rs Rs. My email is anil919217@gmail.com