-
-
చలన చిత్ర నిర్మాత
chalana chitra nirmaata
Author: Sairamraju(V V Raju)
Publisher: Self Published on Kinige
Pages: 71Language: Telugu
సినీపరిశ్రమ అనేది నిర్మాతతోనే మొదలయ్యింది. గ్రిఫిత్గానీ, ఫాల్కేగానీ, రఘుపతి వెంకయ్యగానీ, హెచ్.యం.రెడ్డిగానీ - ఎవరైనా సినిమా తియ్యాలని ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళే పెట్టుబడి పెట్టి కెమెరా, ఫిల్మ్ కొని, నిర్మాణ మెళుకువలు నేర్చుకొని, స్వయంగా దర్శకత్వం వహించి చిత్రాలు నిర్మించారు. ఒకరకంగా నిర్మాతలే తొలి దర్శకులు అని కూడా అనవచ్చు.
మనదేశం ప్రపంచంలోనే అత్యధికంగా చలనచిత్రాలు నిర్మించే దేశం. మన రాష్ట్రం భారతదేశంలోనే అత్యధికంగా చిత్రాలు నిర్మించే రాష్ట్రం.
చిత్ర పరిశ్రమలో నటీనటులకు గానీ, సాంకేతిక నిఫుణులకు గానీ, రచయితలకు గానీ కొరతలేదు. నిర్మాతలే అవసరం. నిర్మాత వుంటేనే పరిశ్రమకు మనుగడ.
అయితే ఈ రోజు చిత్రనిర్మాతలుగా ఎందరో అనుభవం లేనివాళ్ళు, అవగాహన లేనివాళ్ళు ఈ పరిశ్రమకు వస్తున్నారు. వాళ్ళకు సినిమా నిర్మాణం గురించి కనీస పరిజ్ఞానం వుండడం ఎంతో అవసరం. అదే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం.
- రచయిత
