-
-
బ్రహ్మానందలహరి
brahmanandalahari
Author: Simha Prasad
Publisher: Sri Sri Prachuranalu
Pages: 194Language: Telugu
"మా శ్రీవారింత గొప్పవారని నాకింత వరకూ తెలీదు" లోపలికొస్తూ అంది శ్రీలక్ష్మి.
"హఠాత్తుగా జ్ఞానోదయమైనట్టు మాట్లాడుతున్నావేంటి శ్రీలూ" టీపాయ్ మీద కాలు పెట్టుకుని మరీ స్పోర్ట్స్ కాలం చూస్తొన్న బ్రహ్మానందం అడిగాడు.
"రెండిళ్ళవతల వుందే విజయ, ఆవిడ చెప్పే వరకూ నాకు తెలీనే లేదు సుమండీ"
"ఆవిడ సంగతలా వుంచి ఆవిడ వినిపించిన కథ గురించి చెప్పు"
"మీరు నగరంలోని వీఐపీల్లో ఒకరంట కదా"
గాలి కొట్టిన బెలూన్లా ఉబ్బిపోయాడు. మొఖం డబుల్ సైజుకి ఎన్లార్జ్ కాగా ముసి ముసి నవ్వులు కుమ్మరించాడు.
* * *
హాస్య కథల కదంబం ఈ "బ్రహ్మానందలహరి".
ఇవి ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో 22 వారాలపాటు ధారావాహికంగా ప్రచురింపబడి పాఠకులను అలరించి అభినందనలు అందుకున్న 22 + 7 హాస్య కథలు.
ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయ బొమ్మలతో, పేజీల్లో సినిమా చూపించే కొత్త ఎక్స్పరిమెంటు, కామెడీ పిప్పరమెంటు - ఈ "బ్రహ్మానందలహరి".
