-
-
అనంత వాహిని
anantavahini
Author: Dr.Mantha Bhanumathi
Publisher: Self Published on Kinige
Pages: 189Language: Telugu
ఈనాడు తెలుగులోని అన్ని పత్రికల్లోనూ విరివిగా కథలు రాస్తూ ప్రశంసా పూర్వకమైన ప్రాచుర్యం పొందిన ప్రముఖ రచయిత్రి - మంథా భానుమతిగారు.
మధ్యతరగతి మందహాసాలమీదా వారి నవ్వే పెదవులూ, ఏడ్చే కళ్ళమీదా కథలు రాసి అందరిచేతా 'ఔ'ననిపించుకున్న భానుమతి గారి కథా విలక్షణత - మనిషి మనస్తత్వ వైచిత్రి. ఆధునికత తెచ్చిన అనేకానేక అనర్థాల తీరు తెన్నుల్నీ, అనేక దౌర్భాగ్యాల అంతరాల్నీ - ఆమె తన కథాంతర్యానం చేయగలిగారు. ఈ కారణం వలన భానుమతిగారి కథలు 'బరువు'గా పుట్టెడు దుఃఖాన్ని మన నెత్తికెత్తవు. అవి ఆలోచనా ప్రేరకాలు. ఇదీ ఆమె కథల ప్రత్యేకత.
మనుషుల స్వభావాల్లోని లాలిత్యపు రేఖల్ని, దళసరి, పెళుసుగీతల్నీ కూడా నింపాదిగా కథలో ఇమడ్చడం ఆమె కథాశిల్పంలోని ఒక మెళకువ, ఒక గడసరితనం.
భానుమతిగారి కథన శైలి సరళంగా, నిరాడంబరంగా, మిత్ర సమ్మతంగా సాగుతుంది. అందుకనే వారు 'చెప్పిన' కథలుగా ఇవన్నీ మనల్ని ఆత్మీయంగా పలకరిస్తున్నాయి.
- విహారి
