-
-
అమెరికనిజం
amerikanijaM
Author: Rani Siva Sankara Sarma
Pages: 167Language: Telugu
మార్కెట్ స్వేచ్ఛ తనకు తానుగా చలిస్తుంది. అదే అమెరికనిజం. మార్కెట్టు స్వేచ్ఛని అమెరికాకూడా నియంత్రించలేదు. అదే అమెరికనిజం. అమెరికా కన్న కలే అమెరికా చేతినుంచి జారిపోయింది. అమెరికన్ కల వుంది. అమెరికా లేదు.
* * *
అధ్యయనం, అంతర్మధనం కలిసి యీ గ్రంథం ఆవిర్భవించింది. ఆధునికతని విమర్శించడానికి కారణం అది దు:ఖదాయకమైనదని కాదు. ఆధునికత వినసొంపైన ఆదర్శాలని మన ముందు వుంచింది. వాటి వెనుక తన దుర్మార్గాల్ని దాచేసుకుంది. అదీ అసలు సమస్య.
అమెరికా ఆధునికత తీసుకువచ్చిన అనేక ఆదర్శాల్ని పక్కన పెట్టి స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేసింది. స్వేచ్ఛ.. స్వేచ్ఛ.. స్వేచ్ఛ.. యీ అంతులేని స్వేచ్ఛ వెనుక అంతుపట్టని క్రౌర్యాన్ని మరుగుపరచింది.
యిలా తప్పించుకు తిరుగుతున్న వాస్తవాల్ని వేటాడడమే అమెరికనిజం గ్రంథం లక్ష్యం.
* * *
అమెరికనిజం భాషని అయోమయంగా మార్చి మనవైన సంభాషణలూ, స్వగతాలూ, స్మృతులూ లేకుండా చేసింది.
మంచి చెడులను పక్కనబెట్టి మనదైన భాష లేకుండా చేయడం ఆధునికత యొక్క ప్రత్యేక లక్షణం. ప్రధానంగా అమెరికనిజం లక్షణం. బుర్రల్నే ఆక్రమించడంవల్ల మనదైన ఆలోచన, భాష, నుడికారం లేకుండాపోయాయి.
తప్పిపోయిన భాషని తరిగి కనుగొనడమే ప్రధానంగా యీ గ్రంథ లక్ష్యం.
