-
-
అచలపతి కథలు 2
achalapati kathalu 2
Author: M.B.S. Prasad
Publisher: Hasam Prachuranalu
Pages: 109Language: Telugu
హాస్యరసరాజ్యాధినేత వుడ్‌హౌస్ కథల్లో విహరించే జీనియస్ అయిన జీవ్స్ పాత్రే - ఈ ఇంపైన తెలిగింపు కథల్లో అచలపతి.
- మైనర్ బాబు వురఫ్ పిల్ల జమీందారు బెర్టీ వూస్టర్ అతి గడుసుగా తెచ్చిపెచ్చుకునే కష్టనష్టాలలో అతడిని కాపాడి గట్టెక్కించే సూత్రధారి
-దండలో దారంలాంటి అదృశ్య పాత్రధారి.
ఈ వుడ్‌హౌస్ కథలను ఎమ్బీయస్ ప్రసాద్ గారు తెలుగులో చెప్పారు. ఇది అనువాదం కాదు - అనుసృజనా కాదు.. తెన్గింపు కాదు - తెలుగింపు. ఇంపైన సొంపైన తేట తెలుగులో హాయిగా చెప్పారు..
ఇక వుడ్‌హౌస్ కథల గురించి చెప్పబోవడం దినమణి ముందు దివిటీ పట్టడమే..
ప్రసాద్‌గారు ఈ కథల్లో రేగే ఇంగ్లీషు ధూళిమీద తెలుగు పన్నీటి జల్లుతో పరిమళాలు వెదజల్లారు.
-ముళ్లపూడి వెంకటరమణ
చెన్నయ్
ఏప్రిల్, 2005
* * *
ప్రింట్ వెర్షన్‌లోని 18 కథల్లోని తొలి 9 కథలను మొదటి భాగంగా, మలి 9 కథలను రెండవ భాగంగా యీ ఈ-బుక్ రూపంలో అందిస్తున్నాము. మొదటి భాగం ఇక్కడ లభిస్తుంది.
ఈ రెండో భాగంలోని కథలు:
10. అచలపతీ - మగసిరీ
11. అచలపతీ - తెలుగుతండ్రీ
12. అచలపతీ - ఆధునికమాతా
13. అచలపతీ - ఆశాపరులూ
14. అచలపతీ - యయాతి మామయ్యా
15. అచలపతీ - లంకెబిందెలూ
16. అచలపతీ - అణితులూ
17. అచలపతీ - విచిత్రకోతీ
18. అచలపతీ - కరోడ్‌పతీ
చక్కని కథలని ఆస్వాదించండి.
