-
-
ఆనందం
aanandam
Author: Dasari Venkata Ramana
Publisher: Balasahitya Parishad
Pages: 120Language: Telugu
ఇవి సరళంగా, సుందరంగా వుండి పది కాలాలపాటు - కాదు పది పదుల కాలాల పాటు బతికే కథలు. శ్రీ దాసరి వెంకటరమణగారి ఈ కథా సంపుటి నిజంగా 'ఆనందం'గా వుంది.
- రావూరి భరద్వాజ (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, బాలసాహితీవేత్త)
సూర్యకాంతికి సప్తవర్ణాల్లా- ఉత్తమ బాలసాహిత్యానికి ఉన్న సప్త నియమాలు. 1. కథనం సూటిగా, ఆసక్తికరంగా ఉండాలి. 2. పాత్రలు సజీవమై, వాతావరణం కళ్ళకు కట్టాలి. 3. ఇతివృత్తం వాస్తవానికి దగ్గరలో ఉండాలి. 4. సమస్యలు మెదడుకు పదును పెట్టాలి. 5. పరిష్కారాలు తెలివిని పెంచాలి. 6. విశ్లేషణ ప్రయోజనాత్మకం కావాలి. 7. పెద్దలకు ఉల్లాసాన్ని, పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తూ - కథ కలకాలం గుర్తుండి పోవాలి.
ఈ నియమాలు సాహితీ అధ్యయనంలో అభించినవి కావు. 'ఆనందం' తెలియచెప్పినవి.
బాలసాహిత్యానికి ఆనందం సృష్టించిన శ్రీ దాసరి వెంకటరమణ మాన్యులు. ఆ ఆనందం అందుకున్నవారు ధన్యులు.
- వసుంధర (ప్రముఖ రచయిత)
ఇది వ్యక్తిత్వ వికాస కథాసంపుటి. ఇందులోని ప్రతి కథా ఒక ఆణిముత్యమే!
- చొక్కాపు వెంకటరమణ (అధ్యక్షులు-బాలసాహిత్య పరిషత్తు)
పేరుకు తగినట్టుగా ఇందులోని కథలన్నీ ఆనందం కలిగించేవే! ఇందులోని మంచితనం-మంచిధనం Misplaced Heroism పేర
ఆంగ్లంలోనికి అనువాదమై 'చందమామ' వారి అరవై ఏళ్ల ప్రత్యేక సంచికలో చోటుచేసుకోవడం శ్రీ దాసరి వెంకటరమణ బాలసాహిత్య రచనా ప్రతిభకు ఒక నిదర్శనం.
ఈ 'ఆనందం' బాలబాలికలందరికీ తప్పక అందవలసిన మంచి కథల సంపుటి.
- సుధామ ('రచన' మాసపత్రిక మే, 2010)
