-
-
ఆనందమే అందం
aanaMdamE aMdaM
Author: Pothuri Vijayalakshmi
Publisher: Sri Rishika Publications
Pages: 194Language: Telugu
తోచినప్పుడు, తోచనప్పుడు, రైలు ప్రయాణంలో, నిరీక్షణలో చదువుకుని ఈ కథల్ని ఆస్వాదించవచ్చు. పెద్దగా మెసేజ్లు వున్నాయని చెప్పను (దానికి ఎస్ ఎమ్మెస్ చాలు కదా). మారుతున్న అభిరుచుల మీద, వేస్తున్న వెర్రితలలమీద కావల్సినన్ని చురకలున్నాయి. తెలుగు నుడికారాలు, కనుమరుగైన మానవ సంబంధాలు, ఆత్మీయతలు పొత్తూరి విజయలక్ష్మి కథల్లో పుష్కలంగా కనిపిస్తాయి. రుచులెరిగిన వారికి కమ్మని భోజనం "ఆనందమే అందం".
ఏ కథ చదివినా - కొత్త పెళ్లికూతురు పూలు కడుతున్నట్లు, పోకిరీపిల్ల గవ్వలు చిలకరించినట్లు, తొలకరి జల్లులో తడిసిన పాలపిట్ట రెక్కలు విదిల్చినట్టు అనిపిస్తుంది. శ్రీమతి విజయలక్ష్మి యిలాగే సున్నితమైన హాస్యంతో కథలు రాస్తే, చదవాలని ఉవ్విళ్లూరే అనేకానేకమంది పాఠకుల్లో నేను మొదటిబంతిలో వుంటాను. అందుకు తగినట్టుగా వారి లోగిలి సదా సుఖశాంతులతో వుండాలని మనసా కాంక్షిస్తున్నాను.
- శ్రీరమణ
