-
-
యువతా... కాపాడుకో నీ భవిత
Yuvata Kapaduko Ne Bhavita
Author: Kekalathuri Krishnaiah
Pages: 128Language: Telugu
దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి విడుదలైన మొత్తాలు రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వారికి సహాయం చేసే ప్రభుత్వోద్యోగులు ఆ డబ్బు దారి మళ్ళించి వీరి బొక్కసాలు నింపుకుంటున్నారు. బడుగుజీవుల బతుకుల్లో మార్పులేదు. ఎన్నికలొచ్చినప్పుడు అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి ఓట్లు కొనుక్కొంటున్నారు. ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోయాయి. ఏదో కొంత మంది నిజాయితీపరులైన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా వారు చేయగలిగింది పరిమితంగానే ఉంటుంది. డిల్లీ పీఠం మీద, రాష్ట్రాధిపత్యంలోను నిజాయితీ నాయకుడున్నా ఈ అవినీతి ప్రక్షాలన చేయలేరు.
ఈ అవినీతి అంటువ్యాధిలా ప్రబలింది. దీని మూలాలు తెలుసుకొని అంతమొందించాలంటే మంచి వైద్యుల బృందాలు దేశమంతా ఏర్పడాలి, ముఖ్యంగా గ్రామాల్లో ఏర్పడి ప్రబలిన అవినీతి జాడ్యాన్ని నిర్మూలించాలి. ఆ వైద్యులే యువత. బృందాలుగా ఏర్పడి అమాయక ప్రజలకు, బడుగు జీవులకు అండగా నిలిచి వారి వారి గ్రామాలు వారే బాగు చేసుకోవాలి. సరైన నాయకత్వం లేక ప్రజలు దిక్కుతెలియని స్థితిలో ఉన్నారు. మంచి నాయకత్వానికి తోడుగా ప్రజలు ముందుకొస్తారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పొదుపు, గ్రామాభివృద్ధి, రవాణా, నీరు మొదలగునవన్నీ ప్రజలకు సేవ చేయవచ్చును.
మనది వేద భూమి, ఆధ్యాత్మికత, సత్యం, ధర్మం, పునాదులుగా మన దేశం, మన సంస్కృతి వెలసింది. కాబట్టి పల్లె పట్టణం అని లేకుండా అన్ని చోట్లా మానవత్వం విలువలు తెలిసిన మహానుభావులున్నారు.ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చారు. మానవతా విలువలతో, సేవాభావంతో, నిస్వార్ధబుద్ధితో, స్వచ్ఛమైన మనస్సుతో సమాజమునకు ఎనలేని సేవలు చేసి, దేశాభివృద్ధికి తోడ్పడిన దేశ విదేశాలలోని పదిహేను మంది యధార్ధ గాధలు ఈ పుస్తకంలో పొందుపరిచాను.
ఈ పుస్తకం చదివి యువత, దేశభక్తి, సేవాభావంతో స్ఫూర్తిదాయకంగా కొంతమందైన ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
- కేకలతూరి కృష్ణయ్య

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56