-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
యుగధర్మం - ప్రజాస్వామ్యం (free)
Yuga Dharmam Prajaswamyam - free
Author: Eshwarapragada Haribabu
Publisher: Darshanam Magazine
Pages: 232Language: Telugu
ఈ పుస్తకం ఒక అతుకుల బొంత. తెల్లవి, నల్లవి, ఎర్రవి, పచ్చని రంగురంగుల పాతగుడ్డలు అతికించి బొంతనేసినట్లే ఈ పుస్తకంలోని అన్ని అంశాలు కూడా పాతవే. గతకాలంలో ఎప్పుడో ఒకప్పుడు సమాజంకోరి కొని తెచ్చుకుని చుట్టుకున్నవే. నా మనసు మాత్రం సప్త వర్ణాల మిశ్రమంలా ధవళమే. అలాగే అనేక రంగులలాగానే సమాజంలోని అన్ని వర్గాలను సామాజిక, ఆర్థిక, రాజకీయ సాహిత్య వైజ్ఞానిక విషయాలను ఏర్చికూర్చి నేను నేర్చిన విధంగా చేసి ప్రజల ముందుంచుతున్నాను. ఈ యుగధర్మం ప్రజాస్వామ్యం. ప్రజల విషయ పరిజ్ఞానం పెరిగితేనే నాణ్యమైన నాయకులనెంచుకోవడం ద్వారా తమ దేశాన్ని తీర్చిదిద్దగలుగుతారు. లేకుంటే రాబందులూ, వాటి బంధువులే రాజ్యం చేస్తాయి. అభివృద్ధి ఫలాలనాస్వాదించవలసిన వారు, స్వాతంత్ర్యాన్ననుభవించవలసిన వారు ప్రజలే. అలాగే స్వాతంత్ర్యం కోల్పోతే బానిస బ్రతుకులు బ్రతకవలసిన వారూ, అభివృద్ధి జరగకపోతే పేదరికంలో మ్రగ్గవలసినవారు ప్రజలే. ప్రజల అవగాహనను పెంచే ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ అతుకుల బొంతనే భావి భారత బాల బాలికలకు పట్టుపరుపులా పరిణమించాలని నా ప్రగాఢవాంఛ.
- ఈశ్వరప్రగడ హరిబాబు

- FREE
- ₹60
- ₹60
- ₹194.4
- ₹538.92
- ₹60