-
-
యోగాతో మీ జీవనశైలి
Yogato Mee Jeevanashaili
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 96Language: Telugu
యోగాసనాలకు పూర్వం బహుళ ప్రజాదరణ ఉండేది. ఈ మధ్య వాటి ఆదరణ కొంత తగ్గినా; మారుతున్న కాలానికణుగుణంగా నేటి మానవ జీవన శైలిలో చోటుచేసుకుంటున్న సమస్యలు, అలవాట్లు ఆరోగ్య సమస్యలు ఊహించని సంఘటనలు ఆందోళన, నిస్పృహల వలన మళ్ళీ ధ్యానం యోగాల మీద నేటి ప్రజలకు అవగాహన కలగటం ప్రారంభమైంది. ఇది శుభ పరిణామమే అందుకే ఈ మధ్య మెట్రో నగరాలలో యోగా సెంటరులు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.
ఉరుకుల పరుగుల జీవితంలో నేటి మానవుడు తన జీవన శైలిని మార్చుకోవడానికి యోగ చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, మానసిక ఉల్లాసం వ్యక్తిత్వ వికాసాలకు యోగసనాలు చాలా రకాలుగా ఉపయోగపతాయి. క్రీస్తు పూర్వం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యోగసనాలు ఆవిర్భవించి మన భారతీయ సంస్కృతిలో ఇవి ఒక
భాగమయినాయి. దైనందిన జీవితంలో నేడు మానవుడు ఎలా నడుచుకోవాలి, ఎలా పడుకోవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా కదలాలో అన్నిటిని నేర్పించే అద్భుతమైన సుఖ జీవన మంత్రమే యోగ.
మనసు దేహం యొక్క కదలిక యోగ. యోగ అంటే సంయోగము. సంయోగము అంటే లీనమవడం. జీవాత్మ పరమాత్మలో లీనమవడమే యోగం. ప్రకృతి పురుష సంయోగము యోగం. కాలంతో పాటు పరుగులు తీసే నేటి పాఠకులు దైనందిన జీవితంలో తమకంటూ టార్గెట్స్ పెట్టుకొని వాటికోసం ఎంతో శ్రమిస్తూ మరెంతో స్ట్రెస్‌ను అనుభవిస్తుంటారు. ఆ ఆందోళనను దూరం చేస్తూ మా పాఠకులకు సుఖమయ జీవితాన్ని అందించాలని సదుద్దేశ్యంతో నేను రాసిన ఈ పుస్తకాన్ని మీరు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ....
- శైలి
