• Yogasadhana Sanatana Dharmamu
 • Ebook Hide Help
  ₹ 162
  180
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • యోగసాధన - సనాతన ధర్మము

  Yogasadhana Sanatana Dharmamu

  Publisher: Victory Publishers

  Pages: 200
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఇది ఒక యోగసాధనా గ్రంథం. సనాతనమైన ఒక ధర్మాన్ని ప్రక్రియను - కాలానుగుణంగా ప్రజలకు అందించాలనే తపన కలిగిన కృష్ణమూర్తి మాష్టారుగారి అకుంటిత దీక్షా దక్షతకు - అక్షర రూపం. నాకు తెలిసి ఈ విశ్వంలో అక్షరరూపమైన ఏ విషయమూ వృధా కాదు - పైగా ఈ గ్రంథంలోని విషయం నిన్న మొన్నటిది కాదు. కాలధర్మంతో ముడిపడి ఉన్నది. కనుక దీనికి చిరంజీవత్వం అనేది ఆపాదించబడే ఉంటుంది.

సారపు ధర్మము, విమల సత్యము అనేవి ఎప్పటికీ మారవు. కాకపోతే వాటిని మానవుడు ఆయా కాలాలకు పరిస్థితులకు, వ్యక్తులకు, సంఘటనలకు తగినట్లుగా మార్చుకుంటాడు. వాటి ఉనికిని, తన ఉనికిని కాపాడుతూ ఉంటాడు ఇది సత్యం.

అసలు యోగము అంటే... కలయిక ఏం కలయిక అని ప్రశ్న వేసుకుంటే ''జీవాత్మ - పరమాత్మతో కలయిక'' అని చెప్పుకోవచ్చు. వస్తురూపమైన, క్రియారూపమైన ఈ యోగము ద్వారా జీవాత్మా-పరమాత్మకు దగ్గరౌతుంది. దీనినే యోగక్షేమము అందురు. యోగము అంటే లేని దానిని సంపాదించుట; క్షేమం అంటే సంపాదించిన దానిని పదిలపరుచుకోవటం కనుక వస్తు ధర్మంతో కలిసి ఉన్నా - ఈ యోగ ప్రక్రియ ద్వారా మానవుడు తనకు దగ్గరలేని మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బలాన్ని సంపాదించుకుని దాన్ని పదిలపరుచుకుంటారు. ఈ 'యోగము' అనే దానికి - కవచము అని - ఔషధము అనే అర్థాలు కూడా గోచరిస్తాయి. కనుక సకల మానవాళికి ఈ గ్రంథంము కవచము వంటిది - ఔషధము లాంటిది.

ఇది అపారం, అనన్యం, అసాధారణం... అమృతతుల్యం. షడ్చక్రోద్దీపనానికి - ఇది మూలం. ఇది సనాతన ఆర్షధర్మం. ఇంత గొప్ప అనన్యాసామాన్యమైన విషయాన్ని కృష్ణమూర్తిగారు తన వేణుగానము వంటి మృదువైన మాటలతో తను ఆచరిస్తూ... శిష్యులకు బోధిస్తూ... ఎంతో సుఖమును సంపాదించి - అందరికి ఉపయోగపడాలనే సదుద్దేశముతో... చిత్రపట సమన్వితంగా పొందుపరిచి - జాతికి అందించెను. ఈ పుస్తకము కోటాను కోట్ల మానవాళి అభ్యున్నతికి పాటుపడునని విశ్వసిస్తున్నాను.

- వి.వి. శివరామకృష్ణమూర్తి

* * *

"యోగసాధన - సనాతన ధర్మము, ఋషి పతంజలి అష్టాంగ యోగము - పరిశీలన" అన్న ఈ పుస్తకం నన్ను బాగా ఆలోచింపచేసింది.

మనిషి మనీషిగా కావడనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. చాలామంది శ్వాసమీద ధ్యాస పెట్టండి అనో, ఆసనాలను వెయ్యండి లేదా జిమ్‌కి వెళ్లండి ఆరోగ్యం మెరుగవుతుంది, గుండెకి మంచిది అని చెపుతుంటారు.

కానీ నిజమైన ఆరోగ్యం అంటే ఏమిటి? శారీరకంగానే కాకుండ మానసికంగా, స్పిరిట్యుయల్‌గా, ఎమోషనల్‌గా కూడా ఆరోగ్యంగా ఉండండి. దీనికి పలుమార్లు మనల్ని మనం తరచి తరచి ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఋషి పతంజలి ఎప్పుడో చెప్పిన విధివిధానాల సాధనే పరిష్కారం.

యోగసాధన, ప్రాణాయామము, ధ్యానము అన్ని వయస్సుల వారు చేయుటకు వీలుగా వ్రాయబడినది. రోగాలకి కారణము ఆలోచనా విధానమని ఒక డాక్టరుగా నేనూ ఏకీభవిస్తున్నాను. సాధన ద్వారా మంచి ఆలోచనలని స్వంతం చేసుకోండి. ఈ కోణం నుంచి ఈ చిన్న పుస్తకం ఒక పుస్తక రాజమే అని చెప్పవలసి ఉంటుంది.

అన్ని విషయాలకు, పురాణ ఇతిహాసాల నుండు భగవద్గీత నుండి తగు మూలాలతో చేర్చి కూర్చిన ఈ గ్రంథం, ఒకసారి కాదు అనేకసార్లు చదివి, గ్రహించి ఆకళించుకుని, నిత్య జీవితంలో ప్రతివారు అనుసరించి తమకి తాము ఉపయోగపడుతూ, తన చుట్టూ ఉన్న వారికి కూడ ఉపయోగపగలరని ఆశిస్తూ...

- డా॥ మెట్లపల్లి జగన్‌ మోహన్‌

Preview download free pdf of this Telugu book is available at Yogasadhana Sanatana Dharmamu