-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
యోగ వాశిష్ఠ హృదయము (free)
Yoga Vasishta Hrudayamu - free
Author: K V Krishna Murthy
Publisher: Self Published on Kinige
Pages: 849Language: Telugu
పన్నెండేళ్ళ శ్రీరాముడిలో పెల్లుబికిన తత్త్వ విచికిత్సా కల్లోలానికి వశిష్ఠమహర్షి చూపించిన పరిష్కారం ఆత్మతత్త్వావగాహనకై కురిపించిన యుక్తుల వర్షం గజిబిజి అల్లికలైన ఉపనిషత్తులను వింగడించి నిరూపించిన సారం రామాయణ రచనానంతరం వాల్మీకి మహర్షి మహాకవి చేతిలో కవితా రసమయంగా రూపొందిన తాత్త్విక కావ్యం అదే యీ యోగవాశిష్ఠం! దీని సారాన్ని అటు సనాతన సాంప్రదాయిక విద్యతోనూ ఇటు అధునాతన విజ్ఞానశాస్త్రంతోనూ సమన్వయించి కవి హృదయం శ్రోతలకు అందే లాగా అవధూత దత్తపీఠం విద్యాధికారి శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తిగారు చేసిన ప్రవచనాలకి అక్షరరూపమే ఈ యోగవాశిష్ఠ హృదయము.
ఈ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి ఆరు ప్రకరణాలుగా విభజించారు.
వీటిలో మొదటి ప్రకరణం పేరు “వైరాగ్య ప్రకరణం”. 12 యేళ్ళ శ్రీరాముడికి కలిగిన వైరాగ్యాన్ని విపులంగా ఈ ప్రకరణంలో వివరించారు. వైరాగ్యం కలిగితేనే మోక్షం కావాలనే పట్టుదల కలుగుతుంది.
రెండవ ప్రకరణం ముముక్షు వ్యవహార ప్రకరణం. దీనిలో ముముక్షువుకి ఉండవలసిన సాధన సంపత్తిని గూర్చి విస్తారంగా చర్చించారు. దీనిలోనే “మోక్షం కోసమై పురుష ప్రయత్నం చెయ్యాలా? అక్కర్లేదా?” అని విచారణ చేసి, పురుష ప్రయత్నం చెయ్యాలి అని సిద్ధాంతం చేశారు.
మూడవ ప్రకరణమైన ఉత్పత్తి ప్రకరణం లో ఈ కనిపించే ప్రపంచానికి ఉత్పత్తి వుందా? లేదా? వుంటే, ఆ ఉత్పత్తి ఎటువంటిది? అనే విచారణ చేశారు.
నాలుగవ ప్రకరణమైన స్థితి ప్రకరణం లో ఈ కనిపించే ప్రపంచానికి స్థితి వుందా? లేదా? వుంటే, ఆ స్థితి ఎటువంటిది? అనే విచారణ చేశారు. ఈ విషయాలు నిగ్గు తేలితే, ఈ ప్రపంచంయొక్క మూలస్వరూపం తెలుస్తుంది.
ఐదవ ప్రకరణమైన ఉపశమ ప్రకరణం లో జ్ఞానం ద్వారా ప్రపంచోపశమనం కలిగించే విధానాలను వివరించారు.
వీటిలో చిట్ట చివరిది “నిర్వాణ ప్రకరణం.” ఇది చాలా పెద్దది. దీనిని రెండు భాగాలుగా విభజించారు. 1. పూర్వర్థం 2. ఉత్తరార్థం అని. నిర్వాణం అంటే మోక్షం. మోక్షప్రాప్తిని గూర్చి దీనిలో కూలంకషంగా చర్చించారు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE