-
-
యోగ క్షేమం
Yoga Kshemam
Author: Swami Maitreya
Pages: 165Language: Telugu
Description
"దేవుణ్ణి నమ్ముతాము" అంటారు కొందరు. అసలు దేవుడే లేడని అంటారు మరికొందరు. ఈ ఇరువర్గాల వారికి కూడా దేవుడు నిజంగా ఉన్నాడో, లేడో తెలియదు. వారిది కేవలం నమ్మకం మాత్రమే. సృష్టి అంతటా దైవత్వమే నెలకొని ఉంది. ఆ విషయాన్ని నమ్మడం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దైవత్వాన్ని స్వీయానుభవంతో తెలుసుకునే ఒక చక్కని మార్గమే 'యోగ'. అది ఏ మతానికో ప్రాంతానికో సంబంధించినది కాదు. శరీరాన్నీ, మనసును, ఆత్మనూ అనుసంధానం చేస్తూ కర్మను ఆచరించడమే యోగం. అదే క్షేమం.
ఏ మతమైనా ప్రేమ తత్వాన్ని బోధిస్తుంది. శాంతిని ఆకాంక్షిస్తుంది. కానీ, నేడు బయట అంతా అశాంతి, ద్వేషాలే నెలకొని ఉన్నాయి. మతం కంటే ఆధ్యాత్మికత ఉన్నతమైనది. మనిషి శరీరంలో, మనస్సులో, హృదయంలో పరివర్తనను తీసుకువచ్చేదే యోగ. మానసిక చందలత్వాన్ని అధిగమించి, ఆత్మపరంగా జీవించడానికి దోహదపడేదే యోగ. యోగసాధనే ఆనందదాయకం.
Preview download free pdf of this Telugu book is available at Yoga Kshemam
very comprehensive