-
-
ఎడారి పూలు
Yedari Pulu
Author: Saleem
Publisher: J.V.Publications
Pages: 212Language: Telugu
ఆ అమ్మాయికి పధ్నాలుగేళ్ళు.. ఇప్పటివరకూ తనను నిఖా చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తను చూడలేదు. జల్వా సమయంలో అద్దంలో మొహం చూపిస్తారుకదా చూద్దామనుకుంది. కానీ జల్వా లేకుండానే పెళ్ళితంతు ముగించారు. నిఖా చేస్తున్నట్టు కాకుండా ఏదో నేరం చేస్తున్నట్టు... హడావుడిగా చేసేశారు. సుహాగ్ రాత్ రోజు కళ్ళెత్తి అతని మొహంవైపు చూసింది. అంతే... దెయ్యాన్ని చూసినట్టు జడిసి చిన్నగా కేకపెట్టి వెనక్కి పడిపోయింది. ముక్కుపచ్చలారని ఇలాంటి ముస్లిం ఆడపిల్లల కన్నీటి గాథలకు కారణం ఎవరు? అరబ్ నిఖాలు చేసుకునే పేద ముస్లిం ఆడపిల్లల విషాద జీవితాల్ని అక్షరబద్ధం చేసిన నవల "ఎడారి పూలు”.
ఆర్థికావసరాలు తరుముతుంటే బ్రోకర్ల మాటలు నమ్మి అరబ్ దేశాలకు పనిమనుషులుగా వెళ్ళే ఆడవాళ్ళు... కుటుంబాల్ని వదిలేసి కోటి కలల్ని - మోసుకుంటూ ఎడారి దేశాలకు వలసపోయే కార్మికులు... చిక్కటి నల్లటి దుఃఖ సముద్రంలో ఈదుతూ.. అలసిపోయి మధ్య మధ్యలో మునిగి చావబోతూ... మళ్ళా తేలుతూ... కొన్ని వ్యధాభరిత జీవితాల చిత్రణే "ఎడారి పూలు”.

- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108