-
-
యావత్తు మన వేదంలో వున్నాయిష....
Yavattu Mana Vedamlo Unnayisha
Author: Patti Sumathi
Publisher: Praja Paksha Patrika Vividha Bharati
Pages: 108Language: Telugu
“అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష” అని మనకేమీ తెలియదని దృష్టితో అవహేళనం చేయడం మూర్ఖత్వమైతే, అన్నీ వేదాల్లోనే ఉన్నాయనుకోవడం అజ్ఞానం. శాస్త్రీయ దృక్పథంలో పత్తి సుమతి గారు రూపొందించిన వ్యాస సంపుటిలో సైన్సు కాంగ్రెసులో విమానం గురించిన చర్చను విశ్లేషిస్తూ రైట్ సోదరుల ఆవిష్కరణను గురించి వారి కృషిని గురించి విలువైన సమాచారం అందించారు. ‘కన్ను కానని వస్తుతత్వము కాంచనేర్పరు లింగరీజులు’ అని ఆంగ్లేయుల వైజ్ఞానిక దృష్టిని ప్రశంసించిన గురజాడ మన పురాణాలను నమ్మాల్సిన పని లేదని భావించాడు. రచయిత్రి కూడా ఇదే దృష్టి. ఐతే మన ప్రాచీన గ్రంథాల్లో ఉందనుకొన్న మహత్తర విజ్ఞానాన్ని సాంకేతికంగా ఆవిష్కరించే ప్రయత్నం జరగలేదని ఎక్కడ ఏ వైజ్ఞానిక అద్భుతం కనిపించినా ఇవన్నీ మన వాళ్ళెప్పుడో కనిపెట్టారని చెప్పుకునే దౌర్బల్యాన్ని రచయిత్రి ఎండగట్టారు. ఇప్పటికీ మనదేశంలో సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక మేధావులు, శాస్త్రవేత్తలు, విదేశాలకు వెళ్ళి పరిశోధనలు సాగిస్తున్న విషయం మనకు తెలియనది కాదు.
- రచయిత్రి
