-
-
యవనిక
Yavanika
Author: Dr. Ramarao Peddi
Publisher: Self Published on Kinige
Pages: 200Language: Telugu
Description
ఈ మధ్యకాలంలో రామారావు రాసిన పద్యనాటక మహానటుల జ్ఞాపకాలు చాలామందికి కళ్ళనీళ్ళు తెప్పించాయి. విడిగా చదివితే అవి అందమైన జ్ఞాపకాల నోస్టాల్జియాలాగే అనిపించవచ్చు. ఈ సంకలనంలో వాటి అంతరార్ధం బయటపడుతుంది. నాటకం అనేది ఎంత లోతైన, గాఢమైన అనుభూతిని ఇవ్వగలదో ఈ వ్యాసాలు గుర్తుచేస్తాయి. ఆ అనుభవపు దరిదాపులకైనా చేరడానికి మన నాటకాలు కనీస ప్రయత్నమైనా చేస్తున్నాయా అనే ప్రశ్న లేవనెత్తుతాయి. బహుశా ఇన్నేళ్ళ వ్యాసాలతో, ప్రయత్నాలతో పెద్ది రామారావు వెదుకుతున్నది నాటకానికి మాత్రమే వున్న ఈ అద్భుతశక్తిని ఉర్రూతలూగించే ఆ అనుభవాన్ని, కనిపిస్తున్న, వినిపిస్తున్న దానికి అతీతంగా మనకే తెలియని మనలోని ప్రపంచాలని వెలిగించే ఆ ఇంద్రజాలాన్ని.
"ఇచ్చోటనే కదా........."
- రాజీవ్ వెలిచేటి.
Preview download free pdf of this Telugu book is available at Yavanika
"పద్య నాటకం పత్తిపంట లాంటిది. దేనికీ గ్యారెంటీ ఉండదు" - డా|| పెద్ది రామారావు With just this statement, I became a fan to his writing style! You can't write something like this unless you know both - agriculture as well as Padya Natakam. Hats off Rama Rao garu!!