-
-
యాత్రా దీపిక 5 - ఈశాన్య రాష్ట్రాలు
Yatra Deepika 5 North Eastern States
Author: P. S. M. Lakshmi
Pages: 147Language: Telugu
అసోం, అరుణాచల ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ – ఈ ఏడూ ఈశాన్య భారత దేశ రాష్ట్రాలు. వాస్తు శాస్త్ర ప్రకారం ఈశాన్యం దేవతా స్ధానం. భారత దేశానికి దేవతా స్ధానంలాంటి ప్రదేశంలో వుండి, భారత దేశంలో భాగమైన ఈ రాష్ట్రాల గురించి చాలామందికి తెలియదు. ఇవేవో వేరే దేశాలనుకునేవాళ్ళూ మనలో చాలామంది వున్నారు.
వీటిలో అసోం, మేఘాలయ రాష్ట్రాలలో కొన్ని ప్రదేశాలను దర్శించి వచ్చాము. మహిమాన్విత ఆలయాలకు, పురాణ కధలకు, ప్రాచీన చరిత్రలకేకాక అందమైన ప్రకృతికీ ఆలవాలమైన ఈ రెండు రాష్ట్రాలనూ యాత్రా దీపికద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. మరి దేవాలయాలు, ముఖ్యంగా పురాతన దేవాలయాలు ఆధ్యాత్మిక చింతనను, మానసిక ప్రశాంతతను చేకూరిస్తే, ప్రకృతిలో సుందరమైన ప్రదేశాలు మనుషుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపటమేకాదు, శారీరక ఉత్తేజాన్నీ, ఆరోగ్యాన్నీ కూడా ఇస్తాయి.
మరి అప్పుడప్పూడూ ఆటవిడుపులా కుటుంబంతో అలా వెళ్ళి వస్తే నిత్య జీవిత రొటీన్లో కొంత మార్పేకాక, నూతనోత్సాహాన్ని కూడా పుంజుకోవచ్చు. అయితే వీటికి ఎన్నో పరిస్ధితులు సహకరించాలి. తీరా అన్నీ సహకరించిన తర్వాత చాలామంది ఎదుర్కొనే ముఖ్య ఇబ్బంది అక్కడ ఎలా వుంటుంది? వుండటానికి హోటల్స్ వుంటాయా? ఎక్కడ వుంటాయి? ఎంత ధరలో వుంటాయి? భోజనం మన భోజనం దొరుకుతుందా? అక్కడ ఎలా తిరగాలి? ఏమి చూడాలి? ఖర్చు ఎంత అవుతుంది?.. హమ్మో ఎన్ని ప్రశ్నలో!! వాటిల్లో కొన్నింటికన్నా నేనీ పుస్తకం ద్వారా సమాధానాలివ్వగలిగితే, మీరు వెళ్ళినప్పుడు ఇందులో సమాచారం మీకు ఉపయోగపడితే నా శ్రమ ఫలించినట్లే.
* * *
ఈ వ్యాసాలు ఆంధ్రప్రభ.కాం లో 11 వారాలు ధారావాహికంగా వచ్చాయి. ప్రచురించిన ఆంధ్రప్రభ యాజమాన్యానికి, ఆదరించిన పాఠకులకు నా కృతజ్ఞతలు.- పి.యస్.యమ్.లక్ష్మి
- ₹129.6
- ₹86.4
- ₹86.4
- ₹108
- ₹64.8
- ₹86.4
Assam and Meghalaya lo chuda dhagga places gurinchi chala baga vivarincharu.
psm lakshmigarivi print version kavali
we want print version for psm lakshmi yaatra books or can you mail the pdf versions?