-
-
యముడు
Yamudu
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 324Language: Telugu
షాడోని ఖతమ్ చేయాలని అనుకున్న వారెవరూ చేరుకోలేనంత సమీపంలోకి తను చేరుకున్నాడు. వారెవరూ సంపాదించుకోలేని కాన్ఫిడెన్స్‌ని తను సంపాదించుకున్నాడు. షాడో కూర్చునే ప్రదేశంలో పేలుడు పదార్థాన్ని నిక్షేపించగల అవకాశం ప్రపంచంలో తనకు తప్ప మరెవ్వరికీ వచ్చి ఉండదు.
వచ్చిన అవకాశం ఎందుకు చేజారిపోయింది? ఎవరివల్ల అలా జరిగింది?
షాడోని చంపితే కిల్లర్స్ గాంగ్ ఆనందింస్తుంది. ఆ పని చేసిన తనను అందలం ఎక్కిస్తుంది. అటువంటి అదృష్టాన్ని ఎందుకు చేజిక్కించుకోలేకపోతున్నాడు?
ఆలోచనలు అధికం అయినకొద్దీ అతని నిట్టూర్పుల వేగం కూడా ఎక్కువ అయింది. గుండెలు వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టాయి. ఏదో ఒకవిధంగా వచ్చిన పని పూర్తి చేసుకోవాలన్న తపన తీవ్రతరం అయ్యేసరికి, మళ్ళీ గదిలోంచి బయటికి వచ్చాడు.
ఎంతో నమ్మకస్థుడిగా నటిస్తూ, చెడు ఊహలు చేస్తున్న మనిషి తమ మధ్యలో తమతోనే తిరుగుతున్న వైనాన్ని షాడోగాని, బిందు మేడమ్ గాని ఎవరూ గమనించలేదు. కామ్‌గా వున్నది బిల్డింగ్.
