-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
యజ్ఞోపవీత ధారణ విధి (free)
Yagnopavita Dharana Vidhi - free
Author: T. Damodaram
Publisher: Self Published on Kinige
Pages: 31Language: Telugu
పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని సకల యజ్ఞాచరణములలో ద్విజులు ఉపయోగిస్తుంటారు. వటులకు ఉపనయన సంస్కారంలో యజ్ఞోపవీత ధారణ చేస్తారు. యజ్ఞోపవీత ధారణ బలాన్ని తేజస్సు ప్రసాదిస్తుందని శాస్త్ర వచనము. దీనినే బ్రహ్మ సూత్రం, యజ్ఞ సూత్రం, వ్రత బంధం అని కూడా అంటారు. మామూలు వాడుక భాషలో జంధ్యం, జెందెం లేక దంధ్యం అని కూడా పలుకుతున్నారు. యజ్ఞోపవీతాన్ని వివిధ సందర్భాలలో మార్చుకోవలసి వస్తుంది. జాతాశౌచానంతరం అనగా 11 రోజులు పురుడు తీరిన తరువాత మరియు మృతాశౌచానంతరం అనగా మైల తీరిన తరువాత జంధ్యాన్ని మార్చుకోవాలి. కొన్ని పర్వ దినాలలో ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి (జంధ్యాల పూర్ణిమ) నాడు మరియు మకర సంక్రమణము రోజున తప్పని సరిగా నూతన జంధ్యం ధరించాలి. యజ్ఞోపవీతం విచ్ఛిన్నమైన లేక జీర్ణమైనప్పుడు, గ్రహణానంతరం స్నానమాచరించి అందరూ విధిగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. వీలైనంతవరకు శ్రేష్ఠమైన ప్రత్తితో శాస్త్ర పద్దతిగా చేతితో వడికిన నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేయడం చాలా మంచిది. అవసరమైన సంధర్భాలలో ఏ రోజైనా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవచ్చు. నూతన యజ్ఞోపవీత ధారణానంతరం జీర్ణ యజ్ఞోపవీతాన్ని శిరస్సుపై భాగము నుండి మాత్రమే విసర్జించుట ఉత్తమమైనదిగా చాలా మంది వైదిక వేద విజ్ఞుల సూచన. విసర్జింపబడిన జంధ్యాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వదిలివేయవలెను.
- టేకూరు దామోదరం
