-
-
యజ్ఞ వైభవమ్
Yagnavybhavam
Author: Darshanam
Publisher: Marumamula Rukmini
Pages: 112Language: Telugu
సనాతన భారతీయ సంస్కృతిలో వైదిక కర్మలు, అందులో ప్రధానంగా యజ్ఞాలు, యాగాలు అత్యంత విశిష్టమైనవి. మన కర్మభూమిలో ఇలాంటి యాగాలు లోకకల్యాణం కోసం జరిపించడం పరిపాటి.
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో పేర్కొనబడిన ఈ యాగాలకు సంబంధించినటువంటి వైదిక విధానాల్లో మంత్రభాగం వరకూ ఇప్పటివరకు పుస్తకాలలో వచ్చినా, అసలు యాగాలకి సంబంధించిన సమస్త సమాచారం ఇంతవరకూ ప్రచురణకు నోచుకోలేదు.
వైదిక సంస్కృతిలో ఎన్ని రకాల యాగాలు ఉన్నాయి, వాటికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల ప్రమాణాలు ఏమిటి? ఏ యాగం ఎందుకు చేయాలి? వాటి వలన వచ్చే ఫలితాలు ఏమిటి? ఇత్యాది సమస్త విషయాలను, సమాచారాన్ని ఒక చోట క్రోడీకరించి "యజ్ఞవైభవమ్" పేర ఒక ఉత్కృష్టమైన గ్రంథాన్ని అందిస్తోంది "దర్శనమ్".
అనేకమంది పండితులు, మహాత్ములు, ఆహితాగ్నుల నుంచి సేకరించి అందించిన ఈ అపురూప గ్రంథాన్ని తెలుగువారందరూ ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ....
- మరుమాముల వెంకటరమణశర్మ
గమనిక: "యజ్ఞ వైభవమ్" ఈ-బుక్ సైజ్ 12.3 MB
