-
-
యాభై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంక్షోభం
Yabhai Ella Andhra Pradesh Vyavasaya Samkshobham
Author: D. Narasimha Reddy
Publisher: Hyderabad Book Trust
Pages: 39Language: Telugu
మన వ్యవసాయం సంక్లిష్టమైన సమస్యల రంగంగా మారిపోయింది. ఎరువుల నుంచి రుణాల వరకూ ప్రతీ అంశమూ రాజకీయ వివాదాల రంగు పులుముకుంటూ వాస్తవాలు ఎవరికీ పట్టనివై పోతున్నాయి. అసలీ సమస్యల సుడిగుండాలకు మూలాలు ఎక్కడున్నాయో, గత యాభై ఏళ్ళుగా రాష్ట్ర వ్యవసాయ రంగం పయనం ఏ దిశగా సాగుతోందో లోతుగా విశ్లేషించే రచన ఇది. భూ పరిమితులు, సంస్థాగత రుణాలు తగ్గిపోతుండడం, విస్తార సేవల వైఫల్యం, సరళీకరణల వంటి కీలక సమస్యల్నింటినీ ప్రొ. డి. నరసింహారెడ్డి దీనిలో సవివరంగా చర్చిస్తూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలో ప్రణాళికాబద్ధమైన సూచనలు కూడా చేశారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగం డీన్‌గా వ్యవహరించి పదవీ విరమణ పొందిన డి. ఎన్. ఆర్ ప్రస్తుతం న్యూఢిల్లీ లోని ' ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్'కు విజిటింగ్ ఫ్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. రాజకీయ ఆర్థిక విధానాలు, అభివృద్ధి రాజకీయాలు, జెండర్ అధ్యయనాలు, కార్మిక సంఘాలు, మార్కెట్లు, వ్యవసాయం వంటి రంగాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన విశిష్ట పరిశోధకులు. నయా ఉదారవాద విధానాలు బలహీన వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో లోతుగా పరిశోధించారు.
మామిడి భరత్ భూషణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్రం చదివారు. గత రెండు దశాబ్దాలుగా గ్రామీణాభివృద్ధి, పర్యావరణ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. పోలవరం ముంపు సమస్య, అటవీ వనరులపై ప్రజల హక్కులు, గిరిజన సంస్కృతి, 'అభివృద్ధి ప్రేరిత' నిర్వాసిత సమస్యలు, బాలల హక్కులు, పర్యావరణ సంబంధిత విషయాలపై వ్యాసాలు రాశారు. ప్రత్యామ్నాయ ఉపాధి అంశాలపై ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాల్లో సలహాదారుగా పనిచేసారు. తెలంగాణ ఉత్సవ కమిటీకి అధ్యక్షులు.
