-
-
వై.ఎస్.ఆర్ ప్రజల మనిషి
YSR Prajala Manishi
Author: SVN
Publisher: Victory Publishers
Pages: 114Language: Telugu
రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానం ఓ వైరుధ్యాల పుట్ట. సొంత పార్టీలోను బయట పార్టీలతోను అతి నిరంతర సంఘర్షణ అతి విలక్షణత, అతడు కాంగ్రెస్లో సామాన్య కార్యకర్తగా చేరి నిరంతర శ్రమ; అకుంఠిత దీక్షతో అంతర్ బహిర్ శతృవులను ఎదుర్కొని ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు. కూటికోసం, కూలికోసం, శ్రామిక జన సంరక్షణకోసం, ఆకలి కేకలతో మార్మోగే పేదల బ్రతుకులతో అతి సమన్వయం అతడిని 'జననేత'గా ఆంధ్ర ప్రజానీకం తమ హృదయాలలో నింపుకున్నారు. అతడి రాజకీయ శతృవులు సైతం మొక్కవోని అతి ధైర్యసాహసాలకు దిగ్భ్రమచెంది దారి తొలిగారు.
అతడి కుమారుడు జగన్ రాజశేఖరరెడ్డి జీవించి ఉండగానే ఒక ఇంటర్వ్యూలో ''ఒక్క ఎన్.టి.ఆర్. తప్ప తన తండ్రిని మించిన ప్రజా నాయకుడు ఆంధ్రప్రదేశ్లో జన్మించలేదన్నాడు''. ఆయన హఠాన్మరణం అతడు చూపిన త్రోవ బడుగుల కోసం పేద రైతాంగం కోసం అతడు చేపట్టిన పథకాలు జరామరణాలకు అతీతుడుగా ఆంధ్ర లోకంలో ''ఒకే ఒక్కడు''గా నిలబెట్టాయి. ఏ ప్రజాస్వామ్య ఎన్నికల్లోను ఒక్కసారి కూడ ఓటమి ఎరుగని నాయకుడు. తన రాజకీయ జీవితంలో ఆరుసార్లు శాసన సభకు, నాలుగు సార్లు లోక్సభకు ఎన్నికైన ఓటమే ఎరుగని ప్రజానాయకుడు. అది ఎలా సాధ్యమయ్యింది ? దానికి కారణం ఏమిటి?
అది విపులంగా తెలుసుకోవడానికి ఈ చిన్న పుస్తకంలోని విషయాలు పాఠకులకు, యువ రాజకీయవేత్తలకు ఉపయోగిస్తాయని భావిస్తూ.....
- ఎస్వీయన్
