-
-
వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి - రివైజ్డ్
Workplace lo Ila Gelavandi Revised
Author: Suresh Veluguri
Publisher: VMRG International
Pages: 176Language: Telugu
వర్క్‌ప్లేస్ (ఆఫీస్) అనేక అనుభవాలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ నేర్చుకునే పాఠాలే అనుభవాలుగా మారి మనిషి జీవితాన్ని సక్రమంగా ముందుకు నడిపిస్తాయి. ఒక ఉద్యోగి గెలిచినా, ఓడినా అది వారు తమ వర్క్‌ప్లేస్‌లను అర్థం చేసుకోవడం మీదే ఆధారపడివుంటుందని నిపుణులు చెప్తారు.
ఏ రంగంలో పనిచేస్తున్నవారైనా ఉద్యోగులందరికీ వర్క్‌ప్లేస్‌లో అనేక తరహాల సవాళ్లు ఎదురవుతుంటాయి. వర్క్‌ప్లేస్ అంటేనే ఒత్తిళ్ల మయం. ఆఫీసు రాజకీయాలుంటాయి, కెరియర్ ప్రగతిని అడ్డుకునే శక్తులుంటాయి, మన శక్తి సామర్థ్యాలకు సవాళ్లు విసిరే అంశాలుంటాయి. ఇక, ఇప్పుడే కాలేజీలు, యూనివర్సిటీల నుంచి బయటికొచ్చి ఉద్యోగాల్లో చేరుతున్న కొత్తతరం యువతీ యువకుల సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది. వీరికి వర్క్‌ప్లేస్ మీద ఆసక్తి, ఇష్టం ఎంతుంటాయో, అపోహలు, భయాలు కూడా అన్నుంటాయి. వర్క్‌ప్లేస్ ఎలా వుంటుంది, సహోద్యోగులు ఎలా ప్రవర్తిస్తారు, మేనేజ్మెంట్ వ్యవహారాలెలా వుంటాయి, నలుగురితో కలిసిపోవడమెలా? ఒత్తిళ్లు ఎదుర్కోవడం, విజయవంతంగా తమ బాధ్యతలు పూర్తిచేయడమెలా … ఇలాంటి అనేక ప్రశ్నలు, సందేహాలు వారిని తొలిచేస్తుంటాయి. ఇన్ని భయాందోళనల మధ్య తాము ఉద్యోగం చేయగలమా అనే అనుమానాలూ వారిలో తలెత్తుతుంటాయి.
ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులందరికీ వాస్తవ పరిధిలో సూచనలివ్వగల మార్గదర్శి అవసరం. ఈ పుస్తకం ఖచ్చితంగా ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందింది. వర్క్‌ప్లేస్ మేనేజ్మెంట్ మీద తెలుగులో ఇదే మొట్టమొదటి పుస్తకం. ఉద్యోగులకు వర్క్‌ప్లేస్‌లో ఎదురయ్యే వందలాది అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రచయిత సురేశ్ వెలుగూరి ఈ పుస్తకాన్ని రూపొందించారు. లైఫ్‌స్కిల్స్ శిక్షణ నిపుణుడుగా, అనేక కంపెనీలకు కన్సల్టెంట్‌గా, పలువురు ఉద్యోగులకు మెంటర్‌గా తన 20 ఏళ్ల అనుభవాల నేపథ్యం నుంచి ఈ పుస్తకం రాసినట్లు రచయిత పేర్కొన్నారు. కొత్తతరం ఉద్యోగులతో సహా ఉద్యోగులందరికీ ఈ పుస్తకం కీలకంగా ఉపయోగపడుతుంది. సుప్రసిద్ధ జీవన నైపుణ్యాల శిక్షణ నిపుణుడు సుధీర్ అంబళ్ పేర్కొన్నట్లుగా ... ఇది ఉద్యోగులందరి వద్దా తప్పకుండా వుండాల్సిన పుస్తకం.

- ₹108
- ₹324
- ₹60
- ₹214.8
- ₹72
- ₹72