Description
నాజూకు ఉట్టిపడుతున్న టీవీ అనౌనర్స్ ఆంగ్లంలో వార్తలు చెబుతోంది.
“గత నవంబర్ నెలలో ముగ్గురు అధికారుల్ని దారుణంగా హత్యచేసి, సుమారు రెండు కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి దోపిడీ చేసిన నేరానికి ఉరిశిక్ష విధించబడ్డ హంతకుడు రాబర్ట్ విలియమ్స్ కోరిక క్షమాభిక్షను భారత రాష్ట్రపతి తోసిపుచ్చారు.”
“రాబర్ట్‌కు విధించబడ్డ మరణశిక్ష ఈ నెల ఇరవై మూడో తేదీ ఉదయం అమలు జరుగుతుంది.”
“డామిట్!” అంటూ టీవీ స్విచ్ ఆఫ్ చేశాడు నాగూ.
“చచ్చేనాయాలు ఆ డబ్బెక్కడ దాచాడో చెప్పి చస్తే మనకీ చావుండేదిగాదుగా!”
ఎదురుగావున్న ఏడొందల యాభై మిల్లీలీటర్ల ద్రవమున్న సీసాను పైకెత్తి యాభై మిల్లీలీటర్ల రా ఒకే గల్ఫ్‌గా తాగాడు రాకా.
అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న జానీ కస్సుమంటూ లేచాడు.
Preview download free pdf of this Telugu book is available at Women
Login to add a comment
Subscribe to latest comments
