భుజం మీద వున్న సరంజామాను కింద పడేస్తూ చుట్టూవున్న పరిసరాలను పరిశీలగా చూశాడు.
కింద పడిన పంజరం...అడ్డంగా పక్కకు దొర్లింది. తీరికగా కూర్చుని రెక్కల్ని ముక్కుతో దువ్వుకుంటున్న చిలుక సీరియస్గా చూసింది షాడో వంక.
"బ్లడీ రోగ్. డర్టీ బాస్టర్డ్ ...బద్మాష్..." అదిరిపడి చూశాడు షాడో. నిర్లక్ష్యంగా రెక్కల్ని విదిలిస్తూ వరసపెట్టి తిట్టి పోస్తోంది అది.
తన బాధల్ని మరిచిపోయాడు షాడో. నమ్మశక్యంగాని అనుభవం అది. ప్రపంచంలో వున్న పక్షులన్నీ యిలాగే మాట్లాడటం నేర్చుకుంటే మానవుడు ఎక్కడ వుంటాడు? ఈ ఎస్సైన్మెంట్ కంప్లీట్ అయిపోగానే... తను ప్రాణాలతో బయట పడగలిగితే ...చిలుకను ఇండియా తీసుకుపోవాలి. కులకర్ణి గారి ముందు పెట్టి ఆయన ముఖంలోని భావాలని చూడాలి. ప్రణయ కలహాలలో - బిగదీసుకుని కూర్చున్న బిందు దగ్గిరికి రాయబారిగా దీన్ని పంపిస్తే... బిందు ముఖం ఎలా వుంటుంది? చెవి కోసి మేకలా ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని గురించి గోల పెడుతూ వుండే శ్రీకర్ దీని దెబ్బకు తట్టుకోగలడా? సైంటిఫికల్ బ్రెయిన్, మాస్టర్ యింజనీర్ ముఖేష్ - దేవుడు సృష్టించిన యీ వింతను చూసి ఎలా రియాక్ట్ అవుతాడు?
"ఏరా ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అంటూ ఆలోచనలకు అడ్డం వచ్చింది చిలుక.
Good read