-
-
వ్యాసమాలిక
Vyasamalika
Author: A. Sridhar
Publisher: Victory Publishers
Pages: 252Language: Telugu
వ్యాసం అంటే భావాలను వివరించి చెప్పటం. ఒక అంశంపైన మన అభిప్రాయాలను క్రమపద్ధతిలో వెలువరించడం కూడ ఒక కళే. అనవసర విషయ ప్రస్తావన లేకుండా, అభిప్రాయాలను సూటిగా వెల్లిస్తే చదివేవారికి ముచ్చటగా ఉంటుంది. కుతూహలం కలిగిస్తుంది. వ్యాసం శరీరమైతే, ఉపోద్ఘాతం శిరస్సు వంటింది. వ్యాసంలోని పేరాలు శరీర భాగాల్లాంటివి. చివరి పేరాలో కొసమెరుపులా వ్యాస సారాంశాన్ని క్లుప్తంగా ప్రస్తావించి, తుది మెరుగులు దిద్ది వ్యాసాన్ని ముగించాలి.
తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం స్ఫురించేలా లేఖలు వ్రాయటం కూడా ఒక కళే. ఎవరెవరికి, ఎలా ఉత్తరాలు వ్రాయాలి? లేఖలోని భాగాలు ఏ విధంగా ఉండాలి? అనే అంశాన్ని కూడా ఈ పుస్తకంలో తెలియజేశాము. హైస్కూల్, కాలేజి విద్యార్థులు వ్రాసే అన్ని పబ్లిక్ పరీక్షలకు, ప్రభుత్వం వారు నిర్వహించే అన్ని రకాల ఎంట్రన్స్, పోటీ పరీక్షలకేగాక వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించాము. ఆధునిక సాహిత్య ప్రక్రియలో ఒకటైన ఈ వ్యాసరచన వాడుక భాషలో ఉంటేనే పాఠకులకు సులభంగా అర్థమవుతుంది. అందుకే ఈ వ్యాసమాలికను అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లు, మాట్లాడే భాషలోనే రచించి మీకు అందిస్తున్నాం.
మా ప్రయత్నాన్ని హర్షించి, ఆమోదించి, తగు సూచనలిచ్చి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
- ప్రచురణకర్తలు
keka