-
-
వ్యాసభూమి
Vyasabhoomi
Author: Dr. C. Bhavani Devi
Pages: 242Language: Telugu
“ముఖే ముఖే సరస్వతీ! ప్రతి సాహితీవేత్తను చదువుతున్నప్పుడు వారి వారి బహుముఖీన ప్రతిభా వ్యుత్పత్తులు ఆశ్చర్యపరుస్తాయి. వారి ప్రజ్ఞా ప్రాభవాన్నీ సాహితీ చైతన్యయాత్రలోని అవిరళకృషినీ సందర్శించినపుడు నిత్యసాహిత్య విద్యార్థిగా స్పందించటం జరుగుతుంది. హేతువు, బుద్ధి, సృజనాత్మకతలు అభివ్యక్తిలో మేళవించుకున్న ముంగిటి ముత్యాలగురించి ప్రముఖ మహనీయ మానవతామూర్తుల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఆ అధ్యయనమే ఈ “వ్యాసభూమి”.
గత నలభై ఐదేళ్ళుగా తెలుగు సాహితీరంగంలో వివిధ సాహితీ ప్రక్రియల్లో నా కలం ప్రస్థానంలో ఆయా సందర్భాల ననుసరించి రాసిన వ్యాసాలివి. వివిధ పత్రికల్లో, ప్రత్యేకసంచికల్లో ప్రచురితాలు, సాహితీ సదస్సుల్లో సమర్పించిన పరిశోధనా పత్రాలు. కొన్ని సాహిత్యానికి సంబంధించినవైతే కొన్ని సామాజికం, మరికొన్ని ఆధ్యాత్మికం, కొందరు ప్రముఖుల జీవన విశేషాలు ఉన్నాయి. ప్రతివ్యాసం ఆయా ఆధారిత గ్రంథాలు, వ్యాసాలు పరిశీలించి రాసినవి. ఆయా కాలాలలో విజ్ఞులైన పాఠక శ్రోతల ఆదరణ పొందినవి.
- డా. సి. భవానీ దేవి

- ₹64.8
- ₹108
- ₹64.8
- ₹64.8
- ₹216
- ₹270