-
-
వివాహ సంస్కార సంక్షిప్త పరిచయం - రివైజ్డ్
Vivaha Samskara Samkshipta Parichayam Revised
Author: Dr. Remella Avadhanulu
Publisher: Shri Veda Bharathi
Pages: 80Language: Telugu
కర్మలను తెలుసుకుని ఆచరించాలి అని పెద్దలు అంటారు. అలా, చేసే పనులను తెలుసుకుని చేయటం ద్వారా పెళ్ళిళ్ళలో అజ్ఞానం వల్లగానీ, అప్రయత్నంగా గానీ జరిగే పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఇతర మతాలలో వలే, హిందూ మతంలో వివాహం పూర్తిగా లౌకిక కార్యక్రమం గానీ, కేవలం ఇద్దరు వ్యక్తులకో, లేదా రెండు కుటుంబాల మధ్యన కుదుర్చుకుని కాగితాలపై వ్రాసుకునే ఒప్పందం లాంటిదో కాదు. అదొక పవిత్రమైన, శుభప్రదమైన క్రతువు.
ఈ క్రతువును జరిపించటానికి మంత్రాలు ఉంటాయి కానీ, తత్కారణంగా ఏర్పడిన బంధాన్ని విచ్చిన్నం చేయటానికి గాని లేదా రద్దు చేయటానికి ఏ మంత్రాలూ లేని ఏకైక ప్రక్రియ. అందుకే అనేకమైన వేద మంత్రాలు, సంస్కృత శ్లోకాలు, వచనాలూ పఠిస్తారు. వాటి అర్థాలు ఆసక్తికరంగా ఉంటాయి. బహు ప్రచారంలో ఉన్న 'సుముహూర్తం', 'మధుపర్కం' వంటి అనేక పారిభాషిక పదాల వివరాలు, అర్థాలు తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. 'సప్తపది, 'అగ్నిసాక్షి' వంటి అంశాలు న్యాయ పరంగా చట్టాలలో సయితం చోటుచేసుకోవటం వల్ల వాటికి ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా జరుపుకునే వేడుకలకు, ముచ్చట్లకు, సరదాలకు, ఆడంబరాలకు హద్దులే ఉండవు. ఇన్ని ప్రత్యేకతలతో కూడినది కనుకనే వివాహ ప్రక్రియ సర్వాంగ సుందరం, నవరస భరితం, సరస సల్లాప మధురం. ఈ కారణాల దృష్ట్యా వివాహ సంస్కారానికి చెందిన కొన్ని ప్రధానమైన అంశాలను ఈ సంక్షిప్తంగా పరిచయం చేయడం జరిగింది.
- డా. రేమెళ్ళ అవధానులు

- ₹120
- ₹450
- ₹72
- ₹810
- ₹540
- ₹72
- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹810
- ₹540