• Vittala Keerthanalu Annamayyavaa
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవా?

    Vittala Keerthanalu Annamayyavaa

    Publisher: Padma Prachuranalu

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చారిత్రక పరిశోధనకు కావలసిన దృష్టిని, సాహిత్య పరిశోధనకు కావలసిన ఊహను మేళవించి మోదుగుల రవికృష్ణ "విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవా?" అన్న వ్యాస సంపుటిని వెలువరిస్తున్నారు. ఇది సాహిత్య, చారిత్రక పరిశోధన వ్యాస సంపుటి.

14 వ్యాసాలున్న ఈ సంపుటిలో ముందుమాటలు, ముందరి అనుభవాలు, శిధిలమవుతున్న చారిత్రక సంపదను కాపాడలేకపోతున్నామన్న తపన, యాత్రానుభవాలు కలిగించిన సంవేదనలు అక్షర రూపాన్ని పొంది మన బుద్ధికి పదును పెడుతున్నాయి.

రవికృష్ణకు చారిత్రక ప్రదేశాలంటే, చరిత్ర అంటే, పద కవిత్వమంటే, నిఘంటువులంటే, వీటన్నింటి గురించి ఇష్టపడే మనుషులంటే ఇష్టం. ఆ ఇష్టం ఈ వ్యాససంపుటి అంతా పరుచుకొని ఉంది. తాను చూసి వచ్చిన ప్రాంతాన్ని, తనకు కలిగిన అనుభూతిని కల్పనలతో చెప్పి, ఆహా, ఓహో అనిపించుకోవడం కంటే ఆయా చారిత్రక ప్రదేశాల ఔన్నత్యాన్ని మనకళ్ళ ముందు నిలిపే వ్యాసాలు రాశాడు.

సాహిత్యం, చరిత్ర, యాత్రానుభవం, అంతరంగంలో కొందరిపట్ల గూడుకట్టుకున్న ఆరాధన ఈ వ్యాస సంపుటిలో కనిపించి ఆ చారిత్రక ప్రదేశానికి, అతను పొందిన అనుభూతికి మనల్ని కూడా చేరువ చేస్తుంది.

జాగ్రత్తగా చదివి తెలుసుకోవలసిన విషయాల కొరకు సహృదయులకు వినమ్ర వందనాలతో స్వాగతం పలుకుతూ... సెలవు.

- డా. లక్ష్మణ చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Vittala Keerthanalu Annamayyavaa