-
-
విశ్వస్వరూపం
Viswaswaroopam
Author: Vemuri Venkateswara Rao
Pages: 196Language: Telugu
ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు అన్నీ ఒక్క సారి కూర్చుని రాసినవి కావు; నాలుగైదు ఏళ్ల కాల వ్యవధిలో రాసేను. వీటిని అనేక పత్రికలలో ప్రచురించేను. కనుక అన్నిటిని ఒకే సారి, ఒకే వరుస క్రమంలో చదవాలనే నియమం ఏదీ లేదు. మిగిలిన అధ్యాయాలతో ప్రమేయం లేకుండా ఏ అధ్యాయానికి అది చదివినా అర్థం అవాలనే లక్ష్యంతో రాసేను. అధ్యాయాలని నాకు నచ్చిన వరుస క్రమంలో అమర్చేను.
ఈ పుస్తకంలోని పాఠ్యాంశం పురాణ కాలంలో మొదలయి నేటి వరకు నడుస్తుంది. పూర్వులు ఈ విశ్వ స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? ఇప్పుడు మనకి ఎలా అర్థం అవుతోంది? విశ్వ రహస్యాలని ఛేదించడానికి తాత్త్వికులు చేసిన ప్రయత్నాలు ఎటువంటివి? భౌతిక శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఎటువంటివి? ఈ రకం ప్రశ్నలకి వీలయినంతమట్టుకు సమాధానాలు చర్చించేను.
ఈ రకం పుస్తకం తెలుగులో రాయబూనుకోవడం సాహసమే. ఈ రకం పుస్తకాలు ఇంగ్లీషులో ఎన్నో ఉన్నాయి. ఆవి కూడ అర్థం అవాలంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో కొద్దో గొప్పో పరిచయం ఉండాలి. ఈ పుస్తకంలోని విషయాలన్ని అర్థం చేసుకోగలిగే సామర్ధ్యం ఉండాలంటే కనీసం ఉన్నత పాఠశాల వరకు అయినా “సైన్సు” చదివి ఉండాలి. అటువంటి నేపథ్యం లేని వారికి కొన్ని అధ్యాయాలు కొరుకుపడవు. అటువంటివారు ఆయా అధ్యాయాలని మినహాయించి మిగిలిన పుస్తకం చదవండి; పుస్తకంలో చెప్పిన విషయాలలో కనీసం 50 శాతం అందరికీ అందుబాటులో ఉంటుందనే నా నమ్మకం.
- వేమూరి వేంకటేశ్వరరావు
- FREE
- FREE
- FREE
- ₹162
- ₹162
- ₹162
I have read some books about cosmology in English, but I always wanted to read something similar in Telugu, I am glad that I found this book. రచయితకి దన్యవాదాలు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రాయాలని మనవి.
I want this book in my hand.plz tell me where it is available
ఈ పుస్తకం హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు