-
-
విశ్వరూపం
Viswaroopam
Author: Nanduri Ramamohana Rao
Publisher: Victory Publishers
Pages: 505Language: Telugu
మృగప్రాయుడి దశనుంచి ప్రారంభించిన మానవుడు విజ్ఞానం ద్వారా ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కుతూ, నాగరిక మానవుడుగా పరిణమించగలిగాడు. రాతి ఉలుల నుండి ఈనాడు శస్త్ర చికిత్సకు ఉపయోగించే పరికరాలకు రావటమంటేనూ, చెకుముకి ములుకుల బాణాలతో పరిగెత్తే వేట మృగాలను అందుకోవటం నుంచి, రాకెట్ల సహాయంతో శుక్ర, అంగారక గ్రహాలను అందుకోవటం దాకా రావటమంటేనూ, అది ఎంతటి వైజ్ఞానిక పురోగమనమో మనం మరచిపోరాదు.
ఈనాటి కింకా ఆటవిక జీవితం గడిపేవారినీ, నాగరిక మానవులనూ పోల్చి చూసినా వ్యత్యాసం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది.
మనం సాధారణంగా సాంఘిక వ్యవస్థలో కలుగుతూ వచ్చిన పరిణామాలకూ, తాత్విక చింతనలో కలిగిన పరిణామాలకూ ప్రాధాన్యం ఇస్తాం. కాని వైజ్ఞానిక పరిణామం లేని పక్షంలో మిగతా పరిణామాలు సాధ్యం అయిఉండేవి కావు.
ప్రకృతి శక్తులను అర్థం చేసుకోవటమూ, అదుపులోకి తెచ్చుకోవటమూ విజ్ఞానానికి ఫలం, ఎండు కర్రలు మథిస్తేనూ, చెకుముకి రాళ్ళు ఒక దానికేసి ఒకటి కొట్టితేనూ కావాలన్నప్పుడల్లా నిప్పు వస్తుందని తెలుసుకోవటం విజ్ఞానం. ముడి లోహాలనుంచి లోహాలు తయారుచేసి, వాటితో పరికరాలు చెయ్యటం విజ్ఞానం.
పశువుల మందలను తోలకుంటూ సంచార జీవితం గడిపేకన్న భూమిని గోకి ఆహార ధాన్యాలను పెంచినట్టయితే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలుసుకోడవం విజ్ఞానం.
- రచయిత
How to download my విశ్వరూపం బుక్