-
-
విశ్వనాథ పురాణవైర గ్రంథమాల - పరిచయ వ్యాసములు
Viswanatha Puranavaira Granthamala Parichaya Vyasamulu
Author: T. Srivalli Radhika
Publisher: Pramatha Prachuranalu
Pages: 68Language: Telugu
విశ్వనాథ సత్యనారాయణగారి నవలలు ఈ కాలానికీ ఎంతో ఆసక్తిగా చదువుకోదగ్గవిగా వుంటాయి. మొత్తం యాభై ఏడు నవలలు. 27 సాంఘిక నవలలు. 30 చారిత్రక నవలలు. వాటిలో మళ్ళీ “పురాణవైర గ్రంధమాల” అనే శీర్షికతో సాగే నవలలు పన్నెండు.
ఆ పురాణవైర గ్రంధమాలలోని కథను క్లుప్తంగా చెప్తూ వ్రాసిన పరిచయాలివి. నిజానికి యివి పరిచయాలు కూడా కావు. ఈ నవలలు చదివిన తర్వాత నేను వ్రాసిపెట్టుకున్న కొన్ని విషయాలు. ఏ పుస్తకం చదివినా నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయాలూ, గుర్తుపెట్టుకోదగ్గవి అనిపించిన విషయాలు లేక మరికొంత ఆలోచించాలి, పరిశోధించాలి అనిపించిన అంశాలు ఒకచోట పొందుపరచడం నాకు అలవాటు.
అలా నా పరిశీలన కోసం, నేను మళ్ళీ మళ్ళీ చదువుకోవడం కోసం వ్రాసుకున్న ఈ విషయాలు మరికొందరికీ ఉపయోగపడవచ్చునేమో అన్న ఆలోచనతో ఇ-బుక్ గా ప్రచురిస్తున్నాను.
ఈ పరిచయాలలో కొన్ని నామాటలు. కొన్ని నా గొంతు లోనుంచి యదాతథంగా వినిపిస్తున్న విశ్వనాథ మాటలు. అలా కలగాపులగంగా వున్న శైలిని కావాలనే సవరించలేదు. అదొక అందంగా కనిపించింది నాకు. చదివి చూడండి.
- టి. శ్రీవల్లీ రాధిక
