• Viswanath Viswaroopam
  • Ebook Hide Help
    ₹ 450
    500
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశ్వనాథ్ విశ్వరూపం

    Viswanath Viswaroopam

    Author:

    Pages: 214
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'అనామకుడు' చాలా మంచి పేరు. మంచి అనడం కన్న సత్యం అనడం సముచితం. అనామకుడు అంటే మనిషి తాలూకు తొలిపేరు. సహజమైన పేరు. అసలైన పేరు. శ్రీ రామశాస్త్రిగారు తన "మనిషితనం" తనంతో పూజ్యులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారి "కళాతపస్సు" ను చూసారు.

శ్రీ విశ్వనాథ్ గారి సినిమాలు "మనిషితనం" గురించి. దానికి ఆధారభూతమైన జీవుడు గురించి.

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భాషలో చెప్పాలంటే "జీవుడివేదన" గురించి. జీవుడు బుద్ధి, చిత్తము, మనస్సు, అహంకారం ఇత్యాది నామాంతరాలతో పిలవబడుతున్న బద్ధచైతన్యం.

అంటే అనంతమూ, అవ్యయమూ అయిన శుద్ధచైతన్యం పాంచభౌతికమైన ఉపాధిలో బందీ అయిఉండడం.

మామూలు లౌకిక భాషలో అనుకోవాలంటే సూర్యుడి ప్రతిబింబం చిన్న నీటి చెలమలో కనిపించడం లాంటిది.

శ్రీ విశ్వనాథ్ గారి నిర్దేశకత్వంలో, దర్శకత్వంలో, దార్శనికతలో సాకారమైన భావాలను అంతశ్చక్షువులతో చూడగలగాలి. ఆత్మసాక్షిగా దర్శించగలగాలి. మనస్సుతో అనుభూతించగలగాలి.

అలాచేసి, శ్రీ రామశాస్త్రి గారు (సనామకులు) శ్రీ విశ్వనాథ్ గారి తపస్సునీ, ఆ తపః ఫలాల్ని తెలుగు ప్రజలకి, చలనచిత్ర వీక్షకులకి సముచితంగా అందించగలిగారు.

- సిరివెన్నెల సీతారామశాస్త్రి

ఏదైనా విషయం మీద పరిశోధన చెయ్యాలంటే మనకి దానిమీద ఆసక్తి ఉండాలి... అవగాహన ఉండాలి... ఇష్టం ఉండాలి... ప్రేమ ఉండాలి...

'అనామకుడు' అని పేరు పెట్టుకున్న రామశాస్త్రిగారికి... వీటన్నిటితో పాటు... విశ్వనాథ్ గారి మీద అపారమైన 'భక్తి' ఉంది...

శంకరాభరణంతో... విశ్వవ్యాప్తమైపోయిన కళాతపస్వి విశ్వనాథ్ గారంటే.... మాకూ ప్రేమ, గౌరవం... కానీ, రామశాస్త్రి గారికి... మరోస్థాయి పెరిగి... 'పిచ్చి'గా స్థిరపడింది...

ప్రేమ- పిచ్చీ... ఒకటే అన్నాడో మహాకవి... అల్లాగే... పిచ్చంటే పరాకాష్ట... అందువల్లే ఇలాంటి... ఉద్గ్రంథం రాయగలిగారు రామశాస్త్రి గారు....

విశ్వనాథ్ గారి సినిమాలను... పరమ పవిత్రమైన మనస్సుతో చూసి... పరిశీలించి... పరీక్షించి... పరామర్శించి... పరవశం చెందిన తర్వాత తప్ప ఇలాంటి... పుస్తకం రాయడం అసాధ్యం....

విశ్వనాథ్ గారి సినిమాలని... రామశాస్త్రి గారు స్పృశించని కోణం లేదు... ఒక్కోసారి బహుశా... విశ్వనాథ్ గారే ఆశ్చర్యపోయేంత పరిశీలన చేశారు... నిజంగా ఇదొక పరిశోధక గ్రంథం... ఒక 'పి.హెచ్.డి'; అంతకన్నా తక్కువ ఎంత మాత్రం కాదు...

ఒక విధంగా... ఇది... విశ్వనాథ-కాళిదాసుకి... అనామకుడు మల్లినాథ సూరి వ్యాఖ్య... అంత గొప్పగా ఉంది..

- తనికెళ్ళ భరణి

గమనిక: " విశ్వనాథ్ విశ్వరూపం " ఈబుక్ సైజు 10mb

Preview download free pdf of this Telugu book is available at Viswanath Viswaroopam