• Viswa Viharam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    240
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశ్వ విహారం

    Viswa Viharam

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'కవిత్వమొక తీరని దాహం' అంటూనే 'కాదేదీ కవిత కనర్హం' అని కవి ప్రపంచానికి మహాకవి శ్రీ శ్రీ ఏనాడో దిశానిర్దేశం చేశారు. ఆయనే 'తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?' అంటూ ప్రసిద్ధ నిర్మాణాల వెనుక దాగి ఉన్న శ్రమను గుర్తించమని కూడ ఉద్బోధించారు. అలా ప్రసిద్ధ నిర్మాణాలను కవిత్వంలో భాగం చేశారు.

యాత్రలు చేయడం మనకు కొత్తకాదు. అయితే పుణ్యతీర్థాలు, పవిత్రస్థలాలు మాత్రమే దర్శించడం సంప్రదాయం. తెలుగులో సమగ్రయాత్ర చరిత్రకు ఆద్యుడైన ఏనుగుల వీరాస్వామయ్య కూడా పుణ్యస్థలాలు, తీర్థాలు దర్శిస్తూ దారిలో ఎన్నో సందర్శించారు. మనకొక యాత్రా చరిత్ర అందించారు. ఆ కోవలో ఆచార్య నాయని కృష్ణ కుమారి అందించిన 'కాశ్మీర దీపకళిక' కావ్యం కూడ పేర్కొనదగింది. పెద్దగా చదువుకోని నటులు అక్కినేని నాగేశ్వరరావు తన అమెరికా యాత్రను అక్షరీకరించి యాత్రా చరిత్రలో స్థానం పొందారు. సాహిత్యంలో ముందు వరుసలో నిలిచిన వారంతా తాము దర్శించిన ప్రాంతాలు, నగరాలు, కట్టడాల గురించి తమదైన పద్దతిలో రాశారు, రాస్తూనే ఉన్నారు.

ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన యాత్రా సాహిత్యానికి భిన్నమైంది ఈ ‘విశ్వ విహారం'. జువ్వాడి అనే ఇంటి పేరు విన్నవెంటనే నాకు విశ్వనాథ సత్యనారాయణకి మహాభక్తుడు, శిష్యుడు, సంపాదకుడు, విమర్శకుడు, ఆయన సాహిత్యాన్ని ముఖ్యంగా శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని కరీంనగర్ కేంద్రంగా గానం చేసిన జువ్వాడి గౌతమరావు గుర్తుకొచ్చారు. ఇంటిపేరుతో పాటు తను ఎంచుకున్న రంగంలో అంతటి ప్రతిభా విశేషాలు, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వారు జువ్వాడి దేవీప్రసాద్. మూడు దేశాల్లో చదువులు, ఆరు దేశాల్లో ఉద్యోగాలు, సుమారు ముప్పై దేశాల పర్యటనలతో ప్రపంచ యాత్రికుడిగా తనని తాను నిరూపించుకొన్న దేవీప్రసాద్, తన అనుభూతుల వ్యక్తీకరణకు కవిత్వాన్ని ఎంచుకోవడం ఎంతైనా అభినందనీయం! ఎన్నో దేశాల విశేషాలను కొందరు ప్రపంచ స్థాయి నేతలను, తన పేగుబంధాలను గురించి ఎంతో ఆత్మీయంగా ఆవిష్కరించారు.

ప్రపంచ చరిత్ర, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విషయాలపై ఎంతో కొంత పరిజ్ఞానం, అవగాహన ఉంటేనే ఇది సాధ్యం. దర్శించిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తుల గురించి చదువుతూ ఆయా దేశాల కవిత్వాన్ని కొంతైనా చదివి, రాస్తూ ఉండడం వల్ల దేవీప్రసాద్ గారికి ఇది సాధ్యమైందని ఈ కవితలలో స్పష్టంగా తెలుస్తుంది.

- చీకోలు సుందరయ్య

Preview download free pdf of this Telugu book is available at Viswa Viharam