-
-
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ - మిణుగురులు
Viswa Kavi Rabindranath Tagore Minugurulu
Author: Y. Mukunda Rama Rao
Publisher: Self Published on Kinige
Pages: 40Language: Telugu
రవీంద్రనాథ్ ఠాగూర్ మిణుగురులు (Fireflies) 256 లఘు కవితల సంకలనం. 1923 లో మొదటిసారిగా మేక్మిలన్ సంస్థ ఈ Fireflies ని ప్రచురించింది. వీటిలో కొన్ని కవితలు ఆంగ్లంలోనే నేరుగా రాసినా, ఎక్కువ భాగం కవితలు Lekhan - లేఖన్ నుండి, మరికొన్ని Sphulinga - స్ఫులింగ (1946 లో ఠాగూర్ మరణాంతరం ప్రచురించబడింది) నుండి తీసుకున్నవి. అలా ఇందులో కవితలు - 13 స్ఫులింగ నుండి, ఒకటి రవీంద్ర బిక్శ నుండి, 36 నేరుగా ఆంగ్లంలో రాసినవి, తతిమా 206 లేఖన్ నుండి తీసుకున్నవి. చమత్కారాలుగా, నీతి వాక్యాలుగా, పెద్దాయన అద్భుతమైన అనుభవాలు, కాంతిమంతమైన ఆలోచనల మాలగా అనేక విధాలుగా ఇందులో కవితలు కనిపిస్తాయి. జపాన్ చైనా కవిత్వ ప్రభావంతో క్లుప్తంగా సహజంగా సందేశాత్మకంగా ప్రకృతితో మమేకమై ఉంటాయి.
***
సూర్యకాంతిలా నా ప్రేమ
నిన్ను చుట్టుముట్టనీ
అయినా ప్రకాశించే స్వేచ్చ నీకే ఉండనీ
***
దూరాన ఉన్న సముద్రాన్ని
కొండ తన జలపాతంతో స్పర్శిస్తున్నట్టు
నా పాటలో నేను దేవుడ్ని స్పర్శిస్తాను
***
మిత్రుడా
నా ప్రేమ నీ మీద భారం కాకుండా ఉండనీ
అది దానికదే ప్రతిఫలమిస్తుందని తెలుసుకో
