-
-
విశిష్టాద్వైతపు ఆధ్యాత్మిక, సాంఘిక ఆత్మ కథ
Visishtaadvaitapu Adhyaatmika Saamghika Aatma Katha
Author: Acharya Samudrala
Publisher: Self Published on Kinige
Pages: 124Language: Telugu
విశిష్ట అద్వైతమంటే తెలిసిన వారరుదు. శ్రీ వైష్ణవమంటే, అసలు విష్ణువంటే పెడర్ధాలు బోలెడు. పైగా విఅ రామానుజులు బౌద్ధాన్ని పడగొట్టడానికి స్థాపించినదన్న చరిత్రకారుల హిప్నాటిసమ్ మరీన్ను. అది తమిళోద్భవం వారి సొత్తు, అని పొరుగింటి పుల్లకూరల తలపుల పులుపు. అన్నీ కలసి, విఅ అంటే ఏమిటో శ్రీవైష్ణవులమని చెపుకొనే నామాల స్వాములకు కూడా అవగాహన లేదు. విశిష్టాద్వైతమొక మతము కాదని, మూఢ నమ్మకము కాదనీ, కేవలం కనబడని భగవంతునికి సంబంధించినదే కాదని, అది ఒక సాంఘిక విప్లవ జ్యోతి అని మార్క్స్, ఎంగెల్ సామ్యవాదానికి మూలాలు విఅ లో 6000 ఏళ్ళ కితమే పాతుకొని ఉన్నాయని తెలియచేసే ప్రయత్నమే ఈ పుస్తకము. ఆంధ్రులకు విఅ కు ఉన్న సంబంధ మిందులో వివరించాను. నిజంగా విఅ శోభ మొన్నటిది, నేడది అతి దీన స్థితిలో కొట్టుకుంటూంది. ఇది చదివి విఅ లోని అసలు ఆయువు పట్టు సందేశం తెలిసికొంటే మానవ సమాజము మన్నుతుంది లేకుంటే మన్నులో కలుస్తుందన్న భయంతో రాస్తున్నా. ఎవరికైనా ఆసక్తి కలిగితే ధన్యుడిని
- రచయిత

- ₹300
- ₹162
- ₹162
- ₹129.6
- ₹540
- ₹108