-
-
విష్ణు సంహిత
Vishnu Samhita
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 300Language: Telugu
శ్రీమన్నారాయణుని దేవాలయ నిర్మాణ పద్ధతి, ప్రతిష్ట, ఆరాధన మొదలైన వాటిని తేల్పే వైష్ణవాగమాలల్లో పాంచరాత్రాగమం, వైఖానసాగమం అని రెండు భేదాలున్నాయి. వాటిలో పాంచరాత్రాగమాన్ని నాథమునులు, యామున మునీంద్రులు, భగవద్రామానుజులు మొదలైనవారు విశేష శ్రమలకోర్చి ప్రచారం చేసినారు. శ్రీరంగాదిక్షేత్రాల్లో భగవదారాధన ఈ పద్ధతిననుసరించియే సాగుతూన్నది. ఈ విష్ణుసంహిత పాంచరాత్రాగమానికి చెందిన శాస్త్రం. దీనికి కొన్నిచోట్ల విష్ణుతంత్రమనే పేరు కూడా కన్పిస్తున్నది. అస్తు.
అదేం దురదృష్టమో కాని తెలుగువారు ఎక్కువగా అనుసరిస్తున్న పాంచరాత్రాగమ గ్రంథాలు 108 పైగా ఉంటే పట్టుమని పదిగ్రంథాలు కూడా తెలుగులిపిలో దొరకడం లేదు. అవీ చాలా పాతవి. ఎక్కడ దొరుకుతాయో తెలియని స్థితి. భద్రాచలదేవస్థానం వారు పాద్మం, పరమపురుషసంహితలు వేసినారు. అవీ ప్రస్తుతం అలభ్యం. శ్రీమాన్ రేజేటి వేంకట వేణుగోపాలాచార్యులువారు రాజమండ్రి వంటి మహానుభావులు అధిక శ్రమకోర్చి పాంచరాత్రాగమ గ్రంథాలను ముద్రిస్తూ సేవచేస్తున్నారు.
ఈ స్థితిలో అపరరామానుజులుగా ప్రఖ్యాతిగాంచిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు ఈ కార్యక్రమానికి పూనుకొని క్రమక్రమంగా వీటిని తెలుగులిపిలో ముద్రిస్తున్నారు. తెలుగువారు భాగ్యవంతులౌతున్నారు. ఉడతాభక్తి సంప్రదాయసేవగా ఈ గ్రంథాలను తెలుగులిపిలో ప్రచురించి భాగవతోత్తముల సేవచేయాలని దాసుని సంకల్పం. దానిలో భాగంగా తొలుత ప్రచురిస్తున్నదీ విష్ణుసంహిత.
దీన్ని ఔపమన్యువనే మహర్షికి తిరుమలలో తపస్సు చేసికొంటున్న సిద్ధుడు ఉపదేశించినట్లు కన్పిస్తుంది.
దీనిలో విష్ణువైభవం, క్షేత్రక్షేత్రజ్ఞనిర్ణయం, మంత్రోద్ధారవిధి, ఆరాధనా విధానం, ముద్రలు, అగ్నిసంస్కారం, మండలరచనావిధి, దీక్షా స్వీకార విధి, యాగభూమిలక్షణం, ప్రాసాదవిధి, ప్రతిమాలక్షణం మొదలైనవి అనేకం చెప్పబడ్డాయి.
సంక్షిప్తంగానైనా తెలుగు వివరణతో అందించడం ఈ గ్రంథంలోని ప్రత్యేకత.
- లక్ష్మీ నరసింహాచార్య

- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162