-
-
విశాలాంధ్రము
Visalandhramu
Author: Aavatapalli Narayana Rao
Publisher: Bommidala Srikrishnamurthy Foundation
Pages: 280Language: Telugu
కథనంలో నాటకీయత, చదువరిని ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లే శైలి, పొందిగ్గా కలిసి రావడం ఒక చిత్కళ. ఆ కళని సాధన చేసి అబ్బించుకున్న సిద్ధుడు నారాయణరావు. అందుకు అక్షరసాక్ష్యంగా వదాన్యుడు, ఫక్తు ప్రజల ఆసామి జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరిని చదివి చూడండి. ఆ క్రమంలోనే ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్యనొకసారి పలకరించండి. ఆ వ్యక్తుల మీద గౌరవం కలుగుతుంది. ఆసరికే గౌరవం వుంటే పదిరెట్లు పెరుగుతుంది. ఆనాటి విశాలాంధ్రములో వసించిన ప్రముఖులు, వారందించిన సేవలు నేటివారికి తెలియదు. చెన్నపట్నం నించి బరంపురం దాకా తానెరిగిన వారిలోంచి వడపోసి ఎనభైఎనిమిది మందిని యిందులో చేర్చారు. వారు మూడు భాగాలుగా కనిపిస్తారు. ఆణిముత్యాలు, మేలి ముత్యాలు, ముత్యాలుగా ఏరుకొని, చదివి ఆనందించాలి. వారి ఛాయాచిత్రాలను తొలి ఎడిషన్లోనే మంచి కాగితం మీద పొందుపరిచారు. యథాతథంగా కొత్త ఎడిషన్లో భద్రపరిచారు. విశాలాంధ్రములో సంస్కర్తలు, సదాచార పరాయణులు, ఉదారులు, ధర్మప్రవర్తకులు మనకు దర్శన మిస్తారు. వారంతా స్ఫూర్తి ప్రదాతలు. చిరస్మరణీయులు. వారు గ్రంథస్తులై ముందుతరాలకు తెలియాలి. ఈ పుస్తకం పునర్ముద్రణ లక్ష్యం యిది.
- శ్రీరమణ
