• Visada
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశద

    Visada

    Pages: 156
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“సామాజికులచేత మంచి రచనలను చదివించడంలోనూ, రచయితలనుంచి మంచి రచనలను రాబట్టడంలోనూ విమర్శకుడు బాధ్యత వహించాలి. రచయితలకూ, సామాజికులకూ మధ్య విమర్శకుడు ఒక వారధిలా నిలబడాలి. అప్పుడే ఆ విమర్శకు ఒక ప్రామాణికత సంతరించుకుంటుంది. ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే ఈ విమర్శనా గ్రంథాన్ని మన ముందుకు తెస్తున్న పిళ్లా కుమారస్వామిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పడానికే.

ఈ విమర్శనా గ్రంథంలో కుమారస్వామి విమర్శకు స్వీకరించిన రచనలన్నీ విభిన్న ప్రక్రియలకు సంబంధించినవి. అన్నీ ఆధునికమైనవే. ప్రాచీన కావ్యాలను విమర్శించడం వేరు. ఆధునిక సాహిత్యాన్ని విశ్లేషించడం వేరు. ప్రాచీన కావ్య విమర్శకుడికి పౌరాణిక జ్ఞానం కావాలి. కావ్య మర్యాదులు తెలిసి ఉండాలి. లక్షణ శాస్త్రాలు పరిచయం కావాలి. ఆధునిక సాహిత్య విమర్శకుడికి వీటన్నింటితో పాటు ప్రాపంచిక జ్ఞానం కూడా అవసరం. చరిత్ర, సోషియాలజీ వంటి ఇతర సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసి ఉండాలి. ఆధునిక సామాజిక అవసరాలపట్ల అవగాహన కావాలి. కొందరికి ప్రాచీన సాహిత్యం అర్థం కానట్టుగానే. మరికొందరికి ఆధునిక సాహిత్యం అవగాహనకు అందదు. ఆధునిక సాహిత్యం అర్థంకావాలంటే ఆధునికంగా జీవించాలి. ఆధునిక జీవితం తెలిసి ఉండాలి. వీరు మాత్రమే ఆధునిక సాహిత్యాన్ని సాధికారికంగా విమర్శించగలరు. విమర్శ అస్తిత్వాన్ని పెంచగలదు. ఈ విషయంలో కుమారస్వామి సమర్థుడని ఈ గ్రంథంలోని చాలా వ్యాసాలు నిరూపిస్తాయి..

- డా. మేడిపల్లి రవికుమార్

గమనిక: " విశద " ఈబుక్ సైజు 5.8mb
Preview download free pdf of this Telugu book is available at Visada