-
-
విరాట్
Virat
Author: Ponugoti Krishna Reddy
Publisher: Manchi Pustakam
Language: Telugu
స్తెఫాన్ త్స్వైక్ ప్రపంచ ప్రసిద్ద రచయితల్లో ఒకరు. కథకుడుగా, వ్యాసకర్తగా, నాటక రచయితగా, కవిగా సాహిత్యంలో ఆయన స్థానం చిరస్మరణీయమైంది. సుమారు 40 భాషల్లోకి 'విరాట్' అనువదించబడింది. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి.
స్తెఫాన్ త్వ్సైక్ 1915-16 ప్రాంతాల్లో భారతదేశానికి వచ్చారు. భారతీయ తత్వశాస్త్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. భారతీయ వేదాల్ని, ఉపనిషత్తుల్ని, పురాణాల్ని, భగవద్గీతని అధ్యయనం చేశారు.
స్తెఫాన్ త్వ్సైక్ 1881 నవంబర్ 28న వియన్నా (ఆస్ట్రియా)లో జన్మించారు. ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీలలో విద్యాభ్యాసం చేశారు. కీర్తి కాంక్ష ఏ మాత్రం లేని నిరాడంబర వ్యక్తి. గొప్ప ఆత్మాభిమాని, పదవులకు, బిరుదులకు, అధ్యక్షతలకు, సభ్యత్వాలకు, సన్మానాలకు జీవితాంతం చాలా దూరంగా ఉన్నారు.
ఆయన 'యూదు' కావడం వల్ల నాజీలు నిరంకుశత్వానికి, అణచివేతకు గురైనారు. నాజీ పోలీసులు ఈయన పుస్తకాల్ని వెతికి వెతికి తగలబెట్టారు. అక్కడ నుంచి తప్పించుకుని భార్యతో సహా మొదట ఇంగ్లండ్‌కు, తరువాత బ్రెజిల్‌కు పారిపోయారు. చివరకి 1942 ఫిబ్రవరి 22న తన 61వ ఏట భార్యతో పాటు ఆత్మహత్య చేసుకున్నారు.
త్వ్సైక్ రచనల్లో 'విరాట్' అపూర్వ కళాఖండం.
I purchased the book, but i am not able to download it since morning. It's pathetic.