-
-
విప్లవ యోగీశ్వరుడు
Viplava Yogiswarudu
Author: Puttaparthi Narayanacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 18Language: Telugu
శంకరుల తరువాత నరవిందులవంటి మేధాశాలి భారత దేశమున బుట్టలేదు. అతౌడు విశ్వామిత్రునివంటివాడు. రజఃప్రేరితమైన యా తపస్సు – శుద్ధసాత్త్వికమై పరిణామపేశలమైనది. విశ్వామిత్రుడు త్రిపాదగాయత్రిని సృష్టించినట్లే - యరవిందులు భాగవతజీవన విధానమును నిర్ణయించెను. డార్విన్ పరిణామవాదమును దీసికొని యాతఁడు దాని నలౌకికమొనర్చెను. లీలావాదమునకు బరిణామ వాదమును జోడించి బలవత్తరమొనరించెను. ద్వైతమునుండి జగత్సత్య వాదము నతఁడు స్వీకరించినాఁడు. వైయక్తికముక్తి నతఁడు నిరసించి -జగత్తునే దివ్యముగ మార్చుటకు యత్నించెను. ఈసాహసము కని విని యెఱుఁగనిది. హిమాలయమువంటి మేధస్సు - క్షీరసముద్రమువంటి కవితాశక్తి – రెంటిని జోడించికొన్న యరవిందులమూర్తి చిత్రాతి చిత్రమైనది. ఆతనిని దర్శించినప్పుడు – సాధకులకు గలిగినసుఖము అది అనుభవైక వేద్యము. మన యార్యఋషులలో నరవిందులవంటి చిత్ర పురుషుఁడులేఁడు. ధర్మ సంస్థాపకులైన నరులు మహేశ్వరుని అవతారలీలలు. తొలుత నెందఱో అవతరించినారు. ముందు యింకెందో యవతరించెదరు. నిర్మలులై నిరీక్షించుచుందురుగాక.

- ₹270
- ₹378
- ₹72
- ₹216
- ₹108
- ₹72