-
-
విప్లవ తపస్వి - పి.వి.
Viplava Tapasvi P V
Author: A. Krishna Rao
Publisher: S.R. Book Links
Pages: 224Language: Telugu
• కుర్తాళం పీఠాధిపతి అయి సర్వసంగ పరిత్యాగి కావాలనుకున్న పి.వి.నరసింహారావు 1991లో ఒక చారిత్రక అవసరంగా ప్రధానమంత్రి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చింది? • దేశ రూపురేఖలను మార్చేసిన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పి.వి. విదేశీ శక్తులకు తాకట్టుపడాల్సిన దుస్థితి నుంచి దేశాన్ని ఎలా రక్షించారు? ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలేమిటి? • పంజాబ్, కశ్మీర్ వంటి అంతర్గత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తూనే అగ్రదేశాలతో సంబంధాల్ని ఎలా పునరుద్దరించారు? అణు పరీక్షలకు ఎలా రంగం సిద్ధం చేశారు? • అడుగడుగునా ఇంటా, బయటా ప్రత్యర్థులు సృష్టించిన గండాలను గట్టెక్కి అయిదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని ఎలా నిర్వహించగలిగారు? ఆయనకు సహకరించిన కనపడని శక్తులు ఎవరు? • రామజన్మభూమి ఉద్యమం రగలడానికి, బాబ్రీ కూల్చివేతకు దారితీసిన పరిణామాలేమిటి? అడ్వాణీ పాత్ర ఏమిటి? నరేంద్ర మోదీ ఎదుగుదల పి.వి. హయాంలోనే ప్రారంభమైందా? • పి.వి కాలంలో జరిగిన కుంభకోణాలు పూర్తిగా బూటకమైనవా? వాటి నుంచి ఆయన ఎలా బయటపడ్డారు? చంద్రస్వామిని పి.వి ప్రోత్సహించారా? • పి.వి చివరిలో ఎలా నిరాదరణకు గురయ్యారు? ఆయన భౌతికకాయాన్ని కూడా ఎందుకు అవమానించారు? • కోట్ల , వైఎస్ ల మధ్య నాడు రాజకీయ ఘర్షణలు ఎలా ఉండేవి? వైఎస్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? సాహితీ పిపాసి అయిన పి.వి.లో ఒక తిరుగుబాటుదారుడు ఉన్నాడా? • తెలుగుబిడ్డ, దేశానికి తొలి దక్షిణాది ప్రధాని, అపర చాణక్యుడు, తిరుగులేని దేశ భక్తుడు అయిన పి.వి నరసింహారావు గురించి అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రముఖ జర్నలిస్టు ఎ. కృష్ణారావు స్వానుభవంతో రాసిన కథనం ఇది..
- పబ్లిషర్స్
గమనిక: "విప్లవ తపస్వి - పి.వి." ఈబుక్ సైజు 10 mb

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6